స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఓ తల్లి మూడు కాళ్లకు పాపకు జన్మనిచ్చింది.
కడుపులో బేబి ఉమ్మనీరు మింగడంతో డాక్టర్ స్వప్న బృందం అర్థరాత్రి ఆపరేషన్ నిర్వహించారు. శ్రీలతకు జన్మించిన పాప మూడు కాళ్లతో ఉండడంతో వైద్యులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. పాప ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నప్పటికి.. మూడు కాలుపై క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ లోని నీలోఫర్ అస్పత్రికి రెఫర్ చేశారు. మూడుకాళ్లతో జన్మించిన పాపను చూసేందుకు చుట్టపక్కల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు.