కుక్కను తప్పించబోయి ఆటోడ్రైవర్ మృతి


మెదక్ : అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన కుక్కను తప్పించబోయి ఆటో బోల్తాపడగా డ్రైవర్ ప్రాణాలు కోల్పోయిన సంఘటన మెదక్ జిల్లా మనూరు మండలం మోర్గిమోడ్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మనూరు మండలంలోని ఇరక్‌పల్లి పంచాయతీ మోగాతండాకు చెందిన గోపి(31) అనే ఆటో డ్రైవర్,  ప్రయాణికులను తీసుకుని నారాయణఖేడ్ వైపు వెళ్తున్నారు.


మెర్గిమోడ్ వద్ద అకస్మాత్తుగా ఓ కుక్క వేగంగా రోడ్డుపైకి పరుగెత్తుకొచ్చింది. డ్రైవర్ గోపీ దానిని తప్పించే క్రమంలో ఆటో పల్టీకొట్టింది. దీంతో ఆటో కిందపడిన గోపీ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ఉన్న ఆరుగురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. కాగా మృతుడు గోపీకి భార్యతో పాటు ఓ కుమారుడు, మూడునెలల కూతురు ఉన్నారని స్థానికులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top