
గాడితప్పిన పాలన: రమణ
ప్రగతి భవన్ పైరవీల భవన్‌గా మారిందని, పాలన గాడి తప్పిందని టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఎద్దేవా చేశారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇప్పటివరకు రైతులకు పంట రుణాలు.. సలహాలు.. సూచనల జాడేలేదన్నారు. పండించిన పంటకు ధాన్యం సేకరణ పూర్తయి 50 రోజులు గడుస్తున్నా ఉత్తర తెలంగాణ రైతులకు డబ్బులు అందలేదన్నారు. మూడేళ్లయినా సీఎంకు పాలనపై అవగాహన రాలేదని చురకలంటించారు. పిడుగుపాటు మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు.