ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. తెలంగాణ శాసనసభలో శుక్రవారం ఆర్థికమంత్రి ...
హైదరాబాద్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. తెలంగాణ శాసనసభలో శుక్రవారం ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ అంచనాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయన్నారు. నీరు, విద్యుత్ లేక రైతులు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. ద్రవ్య వినిమయ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందన్నారు. హైదరాబాద్ ఆదాయం వల్లే ప్రభుత్వం లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు.