రాష్ట్ర విభజన జరిగే జూన్ 2వ తేదీన వీఆర్ పురంలో పోలవరం వ్యతిరేక సభ నిర్వహించనున్నట్టు గిరిజన సంక్షేమ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు సొందె వీరయ్య తెలిపారు.
భద్రాచలం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన జరిగే జూన్ 2వ తేదీన వీఆర్ పురంలో పోలవరం వ్యతిరేక సభ నిర్వహించనున్నట్టు గిరిజన సంక్షేమ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు సొందె వీరయ్య తెలిపారు. ఆయన శనివారం ఇక్కడ పరిషత్ సమావేశంలో మాట్లాడుతూ.. ఆదివాసీలను జల సమాధి చేసే పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రజానీకమంతా సిద్ధం కావాలన్నారు.
జాతీయ స్థాయిలో ఇందుకు మద్దతు కూడగట్టేందుకు విస్తృత ప్రచారం చేస్తామన్నారు. ఇందులో భాగంగా నిర్వహించే బహిరంగ సభలో మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో నాయకులు పాయం సత్యనారాయణ, ముర్రం వీరభద్రం, సోడె చలపతి, పూనెం సాయి, కన్నారావు, లీలాప్రసాద్, నాగరాజు, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.