వీణా వాణీల శస్త్రచికిత్సపై సందిగ్ధత | Ambiguity being for Veena Vani surgery | Sakshi
Sakshi News home page

వీణా వాణీల శస్త్రచికిత్సపై సందిగ్ధత

May 14 2015 2:03 AM | Updated on Sep 3 2017 1:58 AM

వీణా వాణీల శస్త్రచికిత్సపై సందిగ్ధత

వీణా వాణీల శస్త్రచికిత్సపై సందిగ్ధత

అవిభక్త కవలలు వీణావాణిల శస్త్రచికిత్స పై సందిగ్ధత కొనసాగుతోంది. లండన్ వైద్యులను రప్పించి శస్త్రచికిత్స చేయడానికి సిద్ధమేనన్న ఎయిమ్స్...

సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణిల శస్త్రచికిత్స పై సందిగ్ధత కొనసాగుతోంది. లండన్ వైద్యులను రప్పించి శస్త్రచికిత్స చేయడానికి సిద్ధమేనన్న ఎయిమ్స్... రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయమై రాసిన లేఖ లో పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించింది. తనకు ప్రభుత్వం సంధించిన 4 ప్రశ్నలకు సంక్షిప్తంగా బదులిచ్చింది. ‘‘కేం ద్రం అనుమతి స్తే లండన్ వైద్యులతో ఎయిమ్స్‌లో శస్త్రచికిత్స చే యడానికి సిద్ధమే.

కానీ చిన్నారులను ప్రత్యక్షం గా పరీక్షించనిదే దీనిపై నిర్ణయం తీసుకోలేం. దేనిమీదా స్పష్టత రాకుండా ఖర్చు విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేం’’ అని పేర్కొంది. దీం తో సర్కారు సందిగ్థంలో పడింది. ఎయిమ్స్ వై ద్య బృందాన్ని రాష్ట్రానికి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఆ బాధ్యతను వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్ పుట్టా శ్రీనివాస్‌కు అప్పగించినట్టు ప్రభుత్వ వర్గాలు ‘సాక్షి’కి చెప్పాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement