జేఎన్‌టీయూతో టీసీఎస్‌ ఒప్పందం | Agreement with JNTU Tata Consultancy Services | Sakshi
Sakshi News home page

జేఎన్‌టీయూతో టీసీఎస్‌ ఒప్పందం

Jun 25 2017 2:19 AM | Updated on Sep 5 2017 2:22 PM

జేఎన్‌టీయూతో టీసీఎస్‌ ఒప్పందం

జేఎన్‌టీయూతో టీసీఎస్‌ ఒప్పందం

విద్యార్థులకు మెరుగైన బోధన కోసం జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌ (జేఎన్‌టీయూహెచ్‌)మరో ముందడుగు వేసింది.

బోధన, శిక్షణ కార్యక్రమాల్లో సహకారం అందించనున్న ఐటీ దిగ్గజం
సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థులకు మెరుగైన బోధన కోసం జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌ (జేఎన్‌టీయూహెచ్‌)మరో ముందడుగు వేసింది. ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)తో ఒప్పందం కుదు ర్చుకుంది. ఇందులో భాగంగా జేఎన్‌టీయూహెచ్‌ విద్యార్థులు, ఉపాధ్యాయులు నిర్వహించే కార్యక్రమాలకు టీసీఎస్‌ సహకారం అందించనుంది.

పరిశ్రమ ఆధారిత శిక్షణలు, బోధన అభివృద్ధి కార్యక్రమాలు, విద్యార్థుల ఇంటర్న్‌షిప్, అవార్డులు, పరిశోధన ల్లోనూ టీసీఎస్‌ పాలుపంచుకోనుంది. శనివారం జేఎన్‌టీ యూహెచ్‌ వైస్‌ చాన్స్‌లర్‌ వేణుగోపాల్‌రెడ్డి, టీసీఎస్‌ ఉపాధ్యక్షుడు వి.రాజన్న ఒప్పంద పత్రా లపై సంతకాలు చేశారు. జేఎన్‌టీయూ భాగస్వామ్యంతో దాదాపు పదేళ్లుగా వివిధ అంశాల్లో ఒప్పం దం కుదుర్చుకుని కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపా రు. టీసీఎస్‌ రీసెర్చ్‌ స్కాలర్‌ ప్రొగాంను కూడా పొడిగిం చినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement