రోడ్లపైనే పశువులు

accidents because cattles are on the road - Sakshi

జిల్లా వ్యాప్తంగా పలు సంఘటనలు 

సంతల్లో పశువుల పరుగులతో గాయాల పాలవుతున్న ప్రజలు

పట్టించుకోని  అధికారులు

ఉట్నూర్‌రూరల్‌(ఖానాపూర్‌) : ఆదిలాబాద్‌  జిల్లా కేంద్రంతో పాటు జిల్లా పరిధిలోని ఆయా మండలాల్లో పశువులు రోడ్లపై, సంతల్లో సంచరిస్తుండటంతో అటు వాహనదారులు, ఇటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పశువుల యజమానులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్య వహరిస్తున్నట్లు  తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారిపై ఉన్న జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలైన ఉట్నూర్, నేరడిగొం డ, ఇచ్చోడ, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి ప్రధాన రోడ్ల గుండా పశువులు రోడ్డుపైనే సంచరిస్తుండటంతో  ప్రజలు తంటాలు పతున్నారు. ఇలా సంవత్సరాల పాటు ఇదే సమస్య ఉన్నప్పటికీ పట్టించుకునే నాథులు కరువయ్యారు. పలు ప్రాంతాల్లో  ఇరుకు వంతెనలు, వంతెనలు పగిలిపోయి, స్పీడ్‌ బ్రేకర్లు లేకపోవడంతో అనేక  ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇంద్రవెల్లి మండలం ముత్నూర్‌ సమీపం వరకు రోడ్డు బాగానే ఉన్నప్పటికీ అక్కడి నుండి ఉట్నూర్‌ మండల కేంద్రం వరకు రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో అసలే ఇరుకురోడ్లు ఆపై కిక్కిరిసే వాహనాలు. ఇది చాలదన్నుట్లు కొన్ని పశువులు గుంపులుగా వివిధ ప్రాంతాల్లో రోడ్లపై తిష్టవేసి వాహనదారుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. పశువులను రోడ్లపైకి వదిలి యజమానులు తమను ఎవరేం చేస్తారనే చంద ంగా వ్యవహరిస్తున్నారు. రోడ్లపైకి వదలకుండా యజమానులను కట్టడి చేయాల్సిన పంచాయ తీ పట్టించుకునే పరిస్థితిలో లేదు. పశువులు మందలు మందలుగా రోడ్లపై ఉండటంతో కని పించక రాత్రివేళల్లో ప్రమాదాలు చోటు చేసుకునే ప్రమాదం నెలకొంది. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి పశువులు రోడ్లపైకి రాకుండా చర్యలు చేపట్టాలని వాహన చోదకులు, స్థానికులు కోరుతున్నారు. 

బంజరు దొడ్లు ఉన్నా..

 గ్రామాల్లో పశువుల యజమానులు రోడ్లపై వదిలేసిన పశువులను బంజరు దొడ్లలో వేసి వారికి తగిన రుసుము విధించి వారికి అప్పచెప్పడం జరుగుతుంది. కాని ఉన్న బంజరుదొడ్లు నిరుపయోగంగా మారాయి. గతంలో రోడ్డుపై ఉన్న పశువులను బంజరు దొడ్లలో వేసి యజ మానులకు అప్పజెప్పేవారు. కాని మరల పశువులు యథావిధిగా రోడ్లపై సంచరిస్తున్నాయి. అటు పంచాయతీ అధికారులు, ఇటు పశువుల యజమానులు పట్టించుకోక పోగా పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రాత్రి వేళల్లో అతివేగంగా వచ్చే వాహనదారులు ఢీ కొట్టడంతో మత్యువాత పడటంతో పాటు వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వారసంతల్లో కిక్కిరిసిన జనాల మధ్య పశువులు సంచరిస్తూ ప్రజలను ఇబ్బంది పరుస్తూ కుమ్ములాటలో జనాలు గాయాల పాలవుతున్న సంఘటనలున్నాయి. ఇంత జరిగిన పంచాయతీ అధికారులు వారసంతలో ట్యాక్సులు తీసుకుంటున్న సంతకు కావాల్సిన రక్షణ కల్పించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రోడ్డుపై, సంతల్లో  సంచరించే పశువులను పట్టుకొని వాటి యజమానులకు అప్పగించి లేని ఎడల వేలం నిర్వహించి లేద గోశాలకు అప్పగించాలని ప్రజలు కోరుతున్నారు. 

స్పీడ్‌ బ్రేకర్లు లేక ఇబ్బందులు..
జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారికి పక్కనే కళాశాలలు, పాఠశాలలు ఉన్నాయి. వాహనాల రద్దీ పెరగడంతో  ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ని విద్యార్థుల తల్లి దండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్ని పనులున్న  పిల్లలను పాఠశాలలకు విడిచిపెట్టాల్సిందేనంటున్నారు. ప్ర«ధాన రహదారులపై పాఠశాలల ముందు స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top