ఈనెల 5 నుంచి 10 వరకు తెలంగాణలో ఆసరా పింఛన్లు పంపిణీ చేయనున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ తెలిపారు.
హైదరాబాద్: ఈనెల 5 నుంచి 10 వరకు తెలంగాణలో ఆసరా పింఛన్లు పంపిణీ చేయనున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ తెలిపారు. ఈనెలలో కూడా నగదు రూపంలో పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పారు. మొత్తం లబ్ధిదారుల సంఖ్య 27.38 లక్షలని తెలిపారు.
అనర్హుల ఏరివేతకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. లబ్దిదారుల్లో అనర్హులను గుర్తిస్తే సర్పంచ్ లకు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు. పెన్షన్ల పంపిణీపై కలెక్టర్లతో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో రహదారులు అభివృద్ధి పనులు ఫిబ్రవరి నుంచి చేపట్టనున్నట్టు రేమండ్ పీటర్ తెలిపారు.