జనగామ ప్రజల మనోభావాలను గౌరవించకుండా రాష్ట్ర అధికారలు తప్పుడు రిపోర్టులతో ఈ ప్రాంత చరిత్ర ఉనికికే ముప్పు
టీఆర్‌ఎస్ శ్రేణులు ప్రత్యక్ష పోరుకు దిగాలి
మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి
జనగామ : జనగామ ప్రజల మనోభావాలను గౌరవించకుండా రాష్ట్ర అధికారలు తప్పుడు రిపోర్టులతో ఈ ప్రాంత చరిత్ర ఉనికికే ముప్పు తేచ్చే విధంగా ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా సాధన కోసం ఆర్టీసీ చౌరస్తాలో రెండవ దఫా తలపెట్టిన జేసీ దీక్షలు ఆదివారం నాటికి ఏడవ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో కొండబోయిన పర్శరాములు, గట్టయ్య, యాకయ్య, సాంబరాజు కూర్చోగా, రాజారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జనగామ ప్రజల పోరాట పటిమ, మొక్కవోని నిబద్ధతపై అధికార పార్టీ నాయకులు అవహేలన చేయ డం సిగ్గు చేటన్నారు. టీఆర్‌ఎస్ శ్రేణులు ఇప్పటికైనా జనగామ జిల్లా ఉద్యమంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వం మనసు మారి జిల్లాగా ప్రకటించే వరకు పోరు ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగసాని సత్యపాల్‌రెడ్డి, బర్ల శ్రీరాములు, మహంకాళి హరిచ్చంద్రగుప్త, యాకూబ్, అయిలయ్య, జేఏసీ చెర్మైన్ ఆరుట్ల దశమంతరెడ్డి, మంగళ్లపల్లి రాజు, మాశెట్టి వెంకన్న, క్రిష్ణమూర్తి, రాజమౌళి ఉన్నారు.
జిల్లా ఏర్పాటును అడ్డుకుంటే ఊరుకోం
జనగామ : జనగామ జిల్లా ఉద్యమం కీలక దశలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి యాదాద్రిలో కలపాలని ప్రయత్నం చేస్తున్నాడని జేఏసీ నాయకులు ధర్మపురి శ్రీనివాస్, జక్కుల వేణుమాధవ్, మాజీద్, పిట్టల సురేష్, ఆరోపించారు. భూపరిపాలన ప్రధాన కార్యదర్శి రేమండ్ పీటర్‌కు జనగామను యాదాద్రిలో కలపాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి లేఖ ఇచ్చాడని నిరసిస్తూ ఆదివారం ఆర్టీసీ చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎస్సై రవీందర్ అక్కడకు చేరుకుని దిష్టిబొమ్మ తగులబెట్టిన ఉద్యమ కారులను అరెస్టుచేసి, పీఎస్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో తీగల సిద్ధూగౌడ్, సౌడ రమేష్, ఇరుగు రమేష్, మంతెన మణి, రాకేష్‌గౌడ్, సంపత్, రాజేశ్, శ్రీను, నరేష్ ఉన్నారు.