breaking news
The formation of the district
-
జనగామ ప్రాంత చరిత్ర ఉనికికే ముప్పు
టీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యక్ష పోరుకు దిగాలి మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి జనగామ : జనగామ ప్రజల మనోభావాలను గౌరవించకుండా రాష్ట్ర అధికారలు తప్పుడు రిపోర్టులతో ఈ ప్రాంత చరిత్ర ఉనికికే ముప్పు తేచ్చే విధంగా ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా సాధన కోసం ఆర్టీసీ చౌరస్తాలో రెండవ దఫా తలపెట్టిన జేసీ దీక్షలు ఆదివారం నాటికి ఏడవ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో కొండబోయిన పర్శరాములు, గట్టయ్య, యాకయ్య, సాంబరాజు కూర్చోగా, రాజారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జనగామ ప్రజల పోరాట పటిమ, మొక్కవోని నిబద్ధతపై అధికార పార్టీ నాయకులు అవహేలన చేయ డం సిగ్గు చేటన్నారు. టీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికైనా జనగామ జిల్లా ఉద్యమంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వం మనసు మారి జిల్లాగా ప్రకటించే వరకు పోరు ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగసాని సత్యపాల్‌రెడ్డి, బర్ల శ్రీరాములు, మహంకాళి హరిచ్చంద్రగుప్త, యాకూబ్, అయిలయ్య, జేఏసీ చెర్మైన్ ఆరుట్ల దశమంతరెడ్డి, మంగళ్లపల్లి రాజు, మాశెట్టి వెంకన్న, క్రిష్ణమూర్తి, రాజమౌళి ఉన్నారు. జిల్లా ఏర్పాటును అడ్డుకుంటే ఊరుకోం జనగామ : జనగామ జిల్లా ఉద్యమం కీలక దశలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి యాదాద్రిలో కలపాలని ప్రయత్నం చేస్తున్నాడని జేఏసీ నాయకులు ధర్మపురి శ్రీనివాస్, జక్కుల వేణుమాధవ్, మాజీద్, పిట్టల సురేష్, ఆరోపించారు. భూపరిపాలన ప్రధాన కార్యదర్శి రేమండ్ పీటర్‌కు జనగామను యాదాద్రిలో కలపాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి లేఖ ఇచ్చాడని నిరసిస్తూ ఆదివారం ఆర్టీసీ చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎస్సై రవీందర్ అక్కడకు చేరుకుని దిష్టిబొమ్మ తగులబెట్టిన ఉద్యమ కారులను అరెస్టుచేసి, పీఎస్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో తీగల సిద్ధూగౌడ్, సౌడ రమేష్, ఇరుగు రమేష్, మంతెన మణి, రాకేష్‌గౌడ్, సంపత్, రాజేశ్, శ్రీను, నరేష్ ఉన్నారు. -
జిల్లా ఏర్పాటుతోనే జనగామ అభివృద్ధి
ముస్లిం పోరాట వేదిక ప్రతినిధి ఎండీ.అన్వర్ పట్టణంలో ముస్లింల ర్యాలీ, మానవహారం జనగామ : జిల్లా కేంద్రం ఏర్పాటుతోనే జనగామ అభివృద్ధి చెందుతుందని జనగామ జిల్లా ముస్లిం పోరాట వేదిక ప్రతినిధి ఎండీ. అన్వర్ అన్నారు. జనగామ జిల్లా ఏర్పాటును కోరుతూ జనగామ జిల్లా ముస్లిం పోరాట వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఆ సంఘం ప్రతినిధులు, ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టి, ప్రధాన చౌరస్తాలో మానహారం నిర్వహించి, స్థానిక ఆర్డీఓ కా ర్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం అన్వర్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వం ప్రకటించనున్న జిల్లాల్లో జనగామకు అనుకున్న అనుకూలతలు మరె ప్రాంతానికి లేవన్నారు. జనగామ, పాల కుర్తి, ఆలేరు, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలతో జనగామ జిల్లా పూర్తిగా 50 కిమీ పరిధిలో ఉన్న మండలాలు, గ్రామాలను పునర్ వ్యవస్థీకరించి జనగామ జిల్లా ఏర్పా టు చేసేందుకు శాస్త్రీయంగా బద్ధంగా ఉందన్నారు. వరంగల్‌లో ప్రకటించిన 11 మండలాల్లో 9 మండలాలు జనగామలోనే ఉన్నాయని, జిల్లాగా ప్రకటిస్తే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నిధుల కేటాయింపుతో శాశ్వతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటికే జనగామ ప్రాంత ప్రజలు జిల్లాగా ప్రకటించాలని ఎనిమిది నెలలుగా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, బంద్‌లు, నిరవధిక దీక్షలు చేస్తూ ఆకాంక్షను చాటుతున్నారన్నారు. కానీ, కొంతమంది కుట్రదారులతో జనగామ జిల్లా ఏర్పాటును అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఏర్పాటును ఆకాంక్షను ఆర్డీఓ ద్వారా ప్రభుత్వానికి నివేదిక అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను నిర్వహించామన్నారు. నా యకులు మౌలానా అబ్దుల్ హఫీజ్ ఖాస్మి, అన్వర్ షరీఫ్, మజహర్ షరీఫ్, గౌస్, మోహియోద్దీన్, ముజీబుర్ రహమాన్, కౌన్సిలర్లు ఎండీ.అన్వర్, మహ్మద్ ఎజాజ్, జమాల్ షరీఫ్, జమాతె షబాబ్, అధ్యక్ష, కార్యదర్శులు అన్వర్, ఎక్భాల్, కలీమోద్దీన్, ముజ్తహదిద్ధోన్, ఎండీ.సలీం, ఎజాజ్, ఇమ్రాన్, సమద్, షాజిద్, తహసీన్, అక్రం, అజీమ్, అజహరుద్దీన్, దస్తగిరి, యాకుబ్, యాసర్, ఫయాజ్ పాల్గొన్నారు.