గోదావరి పుష్కరాలకు 67 ఘాట్లు | 67 Godavari Pushkar Ghat | Sakshi
Sakshi News home page

గోదావరి పుష్కరాలకు 67 ఘాట్లు

Dec 18 2014 1:07 AM | Updated on Sep 2 2017 6:20 PM

వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న గోదావరి పుష్కరాలకు తెలంగాణలోని ఐదు జిల్లాల్లో 67 పుష్కరఘాట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  • పుష్కర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష
  • సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న గోదావరి పుష్కరాలకు తెలంగాణలోని ఐదు జిల్లాల్లో 67 పుష్కరఘాట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నదీ తీరంలో ఉన్న పుణ్యక్షేత్రాల్లో ప్రస్తుతం 28 పుష్కర ఘాట్లు ఉండగా,   మరో 39 ఘాట్లను నిర్మించాలని రెవెన్యూశాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించారు.

    పుష్కర ఏర్పాట్లపై పలు విభాగాల అధికారులతో బుధవారం సీఎస్ సమీక్ష నిర్వహించారు. పుష్కరఘాట్ల ఏర్పాటు నిమిత్తం ఐదు జిల్లాల్లో 43 ప్రాంతాలను ఎంపిక చేశారు. నిజామాబాద్ జిల్లాలో కండకుర్తి, తాడ్‌బి లోలి, పో చంపాడు, సావెల్, తడపాకల, గుమ్మిర్యాల్, దోమ్‌చంద్, ఉమ్మెడ, తునిగి ని, కోసిలి, బినోలా, ఆదిలాబాద్ జిల్లాలో బాసర, సోన్, ఖానాపూర్, గూడెం, లక్సెట్టిపేట, మంచిర్యాల, వెలాల, చెన్నూరు, కరీంనగర్ జిల్లాలో.. ఎర్దండి, వల్గొండ, వేంపల్లి వెంకట్రావుపేట, ధర్మపురి, రాయంపట్నం, కోటిలింగాల, తిమ్మాపూర్, మంథని, కాళేశ్వరం, వరంగల్ జిల్లాలో ముళ్లకట్ట, రామన్నగూడెం, మల్లూరు, మంగపేట, ఖమ్మం జిల్లాలో వజీద్, పర్ణశాల, దుమ్ముగూడెం, భద్రాచలం, రామచంద్రాపురం, లిం గాల, చింతిర్యాల , చిన్నతల బయ్యారం, గొమ్మూరు, రామానుజవరం, మల్లేపల్లి ఉన్నాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement