5.3 కిలోల శిశువు జననం
వరంగల్ అర్బన్ జిల్లాలో అధిక బరువు గల శిశువు జన్మించింది.
హన్మకొండ: వరంగల్ అర్బన్ జిల్లాలో అధిక బరువు గల శిశువు జన్మించింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన మంజుల ప్రసవం కోసం హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరింది.
సోమవారం వైద్యులు ఆపరేషన్ చేసి ప్రసవం చేశారు. ఆమెకు ఏకంగా 5.3 కిలోల బరువుగల ఆడ శిశువు జన్మించింది. శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. మంజులకు ఇది మూడో కాన్పని, ఇదివరకు ఇద్దరు కుమారులు ఉన్నారని బంధువులు తెలిపారు.