30 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత | 30 girl students sick | Sakshi
Sakshi News home page

30 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత

Mar 8 2015 11:30 PM | Updated on Oct 5 2018 6:48 PM

ఖమ్మం జిల్లా ములకలపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆహారం విషతుల్యమైంది. దీంతో 30 మందికిపైగా విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.

ములకలపల్లి: ఖమ్మం జిల్లా ములకలపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆహారం విషతుల్యమైంది. దీంతో 30 మందికిపైగా విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఇక్కడి వసతి గృహంలో సుమారు 80 మంది వరకు విద్యార్థినులు ఉన్నారు. ఆదివారం సాయంత్రం వీరికి భోజనంలో వంకాయ కూర, సాంబారు వడ్డించారు. ఇది తిన్న తర్వాత తీవ్ర దగ్గు, కడుపునొప్పితో 30 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు లోనుకాగా సిబ్బంది వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

 

కాగా, అస్వస్థతకు గురైన విద్యార్థినులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు బత్తుల అంజి, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు దండి కొమరయ్య పరామర్శించారు. విద్యార్థినులను ఆస్పత్రికి తరలించడంలో సాయం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement