16 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం | 16 kgs of Silver ornaments seized | Sakshi
Sakshi News home page

16 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం

Jan 21 2016 6:06 PM | Updated on Sep 3 2017 4:03 PM

ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

మట్టెవాడ (వరంగల్) : ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన వరంగల్ రైల్వే స్టేషన్‌లో గురువారం చోటుచేసుకుంది. మచిలీపట్నంకు చెందిన సుంకరి సురేష్, సుంకరి మహేష్ అనే ఇద్దరు వ్యక్తులు మచిలీపట్నం నుంచి వరంగల్ చేరుకొని అక్కడి నుంచి జనగామ వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా.. గుర్తించిన రైల్వే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement