108 ఉద్యోగుల సహాయ నిరాకరణ | Sakshi
Sakshi News home page

108 ఉద్యోగుల సహాయ నిరాకరణ

Published Tue, Aug 14 2018 1:57 PM

108 Employes Protest - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: అత్యవసర పరిస్థితుల్లో బాధితుల వద్దకు వేగంగా వెళ్లి ప్రథమ చికిత్స అం దించి, ఆతర్వాత మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రి కి తరలించే 108 వాహన సేవలకు కొద్ది రోజు లుగా ఆటంకం ఏర్పడుతోంది. జీఓ నంబర్‌ 3 ప్రకారం వేతనాలు చెల్లించాలని, పని సమయాన్ని 8గంటలకు తగ్గించాలని, పీపీపీ విధానాన్ని రద్దు చేసి 108 వ్యవస్థను ప్రిన్సిపల్‌ సెక్రెటరీ పరిధిలోకి మార్చాలని ఆయా ఉద్యోగులు జీవీకే – ఈఎంఆర్‌ఐ యాజమాన్యానికి ఇటీవల నోటీసు ఇచ్చారు.

ఈమేరకు ఈనెల 11వ తేదీ నుంచి ఈఎంటీలు, డ్రైవర్లు రోజూ 8గంటల పాటు విధులను బహిష్కరించి సహాయ నిరాకరణకు దిగారు. జిల్లాలో 108 వాహనాలు 9 ఉన్నాయి. మానుకోట, కేసముద్రం, కొత్తగూడ, బయ్యారం, మరిపెడ, తొర్రూర్, కురవి, గూడూరు మండలాల్లో వాహనాలు ఉండగా, డ్రైవర్లు, టెక్నీషియన్లతో కలిపి మొత్తం 45 మంది ఉన్నారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా 8 గంటలకు బదులు 12 గంటలు పనిచేయిస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు.

ప్రస్తుతం సహాయ నిరాకరణలో భాగంగా ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు విధులు నిర్వర్తించి, పగలు 4గంటలు, రాత్రి 4 గంటలు అంబులెన్స్‌ నిలిపివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

డిమాండ్లు నెరవేర్చాలి

పనివేళలు తగ్గించడంతోపాటు వేతనాలు పెంచాలి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి.

– పాక విజయ్‌కుమార్, 108 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు 

Advertisement

తప్పక చదవండి

Advertisement