యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధిపై సీఎం కేసీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. దేవస్థానం, పరిసరాల అభివృద్ధిపై నిపుణులతో ఆయన చర్చించారు.
హైదరాబాద్:యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధిపై సీఎం కేసీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. దేవస్థానం, పరిసరాల అభివృద్ధిపై నిపుణులతో ఆయన చర్చించారు. దీనిలో భాగంగా గుట్ట దేవస్థానం నమూనా మార్పులపై మోడల్స్ ను కేసీఆర్ పరిశీలించారు. రానున్న బడ్జెట్ లో యాదగిరిగుట్ట అభివృద్ధికి రూ.100 కోట్లను కేటాయించనున్నట్లు కేసీఆర్ వారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం కేసీఆర్ యాదగిరిగుట్ట పర్యటనకు వెళ్లనున్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 27న మరోసారి యాదగిరిగుట్ట వెళ్లనున్న కేసీఆర్.. స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. యాదగిరిగుట్ట అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ గా జి.కిషన్ రావును ఎంపిక చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.