ఇంద్రవెళ్లి మండలం ధర్మసాగర్ గ్రామంలో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఇంద్రవెళ్లి మండలం ధర్మసాగర్ గ్రామంలో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఇంట్లో ఉంచిన 10 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. సుమారు 45 వేల నష్టం వాటిల్లినట్లు బాధితుడు నాతూ సింగ్ తెలిపాడు. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు.