ఆ ఫోన్ కు మూడు 13ఎంపీ కెమెరాలు | Micromax Dual 5 camera smartphone launched at Rs 24,999 with three 13MP cameras | Sakshi
Sakshi News home page

ఆ ఫోన్ కు మూడు 13ఎంపీ కెమెరాలు

Mar 29 2017 7:01 PM | Updated on Sep 5 2017 7:25 AM

ఆ ఫోన్ కు మూడు 13ఎంపీ కెమెరాలు

ఆ ఫోన్ కు మూడు 13ఎంపీ కెమెరాలు

చైనా కంపెనీలకు ధీటుగా డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్ రేస్లోకి మైక్రోమ్యాక్స్ వచ్చేసింది.

చైనా కంపెనీలకు ధీటుగా డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్ రేస్లోకి మైక్రోమ్యాక్స్ వచ్చేసింది. డ్యూయల్ 5 పేరుతో బుధవారం ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. దీని ధర రూ.24,999గా కంపెనీ నిర్ణయించింది. ఏప్రిల్ 10 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ విక్రయాలను కంపెనీ ప్రారంభించనుంది. ఫ్లిప్ కార్ట్ తో పాటు మైక్రోమ్యాక్స్ ఈ-స్టోర్, ఆఫ్ లైన్ స్టోర్లలోనూ డ్యూయల్ 5 అందుబాటులోకి రానుంది. కంపెనీ సైట్ ద్వారా ఈ ఫోన్ ముందస్తు రిజిస్ట్రేషన్లను మైక్రోమ్యాక్స్ ప్రారంభించింది. డ్యూయల్ కెమెరా సెటప్ దీనిలో ప్రధాన ఆకర్షణ. ఈ రెండు కెమెరాలు 13 మెగాపిక్సెల్ సెన్సార్ నే కలిగి ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా కూడా 13 మెగాపిక్సెల్ నే కలిగి ఉంది. డ్యూయల్ సిరీస్ లో ఇదే తొలి స్మార్ట్ ఫోన్. త్వరలోనే డ్యూ4ను మార్కెట్లోకి తేనున్నట్టు కంపెనీ ప్రకటించింది.  
 
మైక్రోమ్యాక్స్ డ్యూయల్ 5 ఫీచర్లు....
5.50 అంగుళాల ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ ప్లే
1080x1920 పిక్సెల్స్ రెజుల్యూషన్
ముందు వైపు గొర్రిల్లా గ్లాస్ 3 స్క్రీన్
వెనుకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్
1.4గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్
4జీబీ ర్యామ్
128జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్
3200 ఎంఏహెచ్ బ్యాటరీ
13ఎంపీతో రెండు వెనుక కెమెరాలు
13ఎంపీతో ఫ్రంట్ కెమెరా
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో
4జీ, వాయిస్ ఓవర్ ఎల్టీఈ సపోర్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement