ఫ్లిప్ కార్ట్ గ్రాండ్ గాడ్జెట్ సేల్: బంపర్ డిస్కౌంట్లు | Flipkart Grand Gadget Sale: Discounts on MacBook Air, Apple Watch and others | Sakshi
Sakshi News home page

ఫ్లిప్ కార్ట్ గ్రాండ్ గాడ్జెట్ సేల్: బంపర్ డిస్కౌంట్లు

Jun 12 2017 5:01 PM | Updated on Aug 20 2018 3:07 PM

ఫ్లిప్ కార్ట్ గ్రాండ్ గాడ్జెట్ సేల్: బంపర్ డిస్కౌంట్లు - Sakshi

ఫ్లిప్ కార్ట్ గ్రాండ్ గాడ్జెట్ సేల్: బంపర్ డిస్కౌంట్లు

ఈ-కామర్స్ దిగ్గజం గ్రాండ్ గాడ్జెట్ సేల్ ను ప్రారంభించింది. ప్రమోషనల్ లో భాగంగా వివిధ రకాల గాడ్జెట్లు, స్మార్ట్ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.

న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం గ్రాండ్ గాడ్జెట్ సేల్ ను ప్రారంభించింది. ప్రమోషనల్ లో భాగంగా వివిధ రకాల గాడ్జెట్లు, స్మార్ట్ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ సేల్ జూన్ 14తో ముగుస్తోంది. స్మార్ట్ ఫోన్లు, కెమెరాలు, ల్యాప్ టాప్ లు, వేరియబుల్స్, బ్యూటికి సంబంధిత గాడ్జెట్లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.  ఈ ఆఫర్లలో భాగంగా శాంసంగ్ గెలాక్సీ జే మ్యాక్స్, లెనోవో ఫ్యాబ్ 2 సిరీసెస్, ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్(కోర్ ఐ5 5వ తరం) ల్యాప్ టాప్, హెచ్ పీ ఏపీయూ క్వాడ్ కోర్ ఏ8 ల్యాప్ టాప్, ఆపిల్ వాచ్ సిరీస్ 1 అండ్ 2, ఆసుస్ జెన్ వాచ్ 2, ఫిట్ బిట్ ఛార్జ్ హెచ్ఆర్, జేబీఎల్ ఫ్లిప్ 2, ఫిల్లిప్స్ వైర్ లెస్ పోర్టబుల్ స్పీకర్ వంటి గాడ్జెట్లపై కంపెనీ ధరలను తగ్గించింది. 
 
లెనోవో ఫ్యాబ్ సిరీసెస్ 2పై  ప్రారంభ డిస్కౌంట్ 6 శాతం నుంచి 13 శాతం మధ్యలో ఉంది. డిస్కౌంట్ తో పాటు, ఎక్స్చేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉంచింది ఫ్లిప్ కార్ట్. లెనోవో ఫ్యాబ్ 2(32జీబీ) వేరియంట్ రూ.9,999కే అందుబాటులో ఉండగా.. ఈ ఫోన్ పై రూ.9000 ఎక్స్చేంజ్ ఆఫర్  ఉంది. అంతేకాక ఫ్యాబ్ 2 ప్లస్ (32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్) ను రూ.13,999కే కొనుగోలుచేయవచ్చు.  ఈ ఫోన్ పై కూడా 13వేల రూపాయల ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. 
 
శాంసంగ్ గెలాక్సీ జే మ్యాక్స్(8జీబీ వేరియంట్) పై 14 శాతం డిస్కౌంట్ ను ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 13,900 రూపాయలకు లాంచ్ కాగ, ప్రస్తుతం 11,900కే అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్కౌంట్ తో పాటు మూడు నెలలు, ఆరు నెలలు ఎలాంటి ధరలు లేని  ఈఎంఐలను కొనుగోలుదారులకు కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ ల్యాప్ టాప్ డిస్కౌంట్ ధరలో 55,990 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు. అదనంగా డెబిట్, క్రెడిట్ కార్డు కస్టమర్లకు 5 శాతం డిస్కౌంట్ ఉంది.
 
అదనంగా మరో రూ.2000 వరకు అదనపు డిస్కౌంట్లను ల్యాప్ టాప్ లపై అందిస్తోంది. అంతేకాక యాక్సిస్ బ్యాండ్ బుజ్ క్రెడిట్ కార్డు హోల్డర్స్ కు 5 శాతం డిస్కౌంట్ ను ఇస్తోంది. మిగతా గ్యాడ్జెట్లపై కూడా ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది. మరోవైపు ఫ్లిప్ కార్ట్ తొమ్మిదిరోజుల పాటు ఫ్యాషన్ సేల్ ను కూడా నిర్వహిస్తోంది. దీంట్లో 50 బ్రాండ్స్ పై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ ఫ్యాషన్ సేల్ జూన్ 18కి ముగియనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement