ఫ్లిప్ కార్ట్ లో రూ.9999కే ల్యాప్ టాప్ | Flipkart Back to College Sale Deals: Intel-Powered Laptop Offers Starting at Rs. 9,999 | Sakshi
Sakshi News home page

ఫ్లిప్ కార్ట్ లో రూ.9999కే ల్యాప్ టాప్

Jun 22 2017 10:53 AM | Updated on Aug 1 2018 3:40 PM

ఫ్లిప్ కార్ట్ లో రూ.9999కే ల్యాప్ టాప్ - Sakshi

ఫ్లిప్ కార్ట్ లో రూ.9999కే ల్యాప్ టాప్

దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ల్యాప్ టాప్ లపై భారీగా డిస్కౌంట్లు, డీల్స్ ను ఆఫర్ చేస్తోంది.

దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ల్యాప్ టాప్ లపై భారీగా డిస్కౌంట్లు, డీల్స్ ను ఆఫర్ చేస్తోంది. 'బ్యాక్ టూ కాలేజ్' సేల్ లో భాగంగా ఈ ఆఫర్లను తీసుకొచ్చింది. ల్యాప్ టాప్ లపై మాత్రమే కాక, స్మార్ట్ ఫోన్లపై కూడా ధర తగ్గింపు కోసం డ్రీమ్ ఫోన్ సేల్ ఆఫర్ను ప్రవేశపెట్టింది. బ్యాక్ టూ కాలేజ్ సేల్ లో భాగంగా ఇంటెల్ ల్యాప్ టాప్ లు అత్యంత తక్కువగా రూ.9999కే అందుబాటులో ఉన్నాయి. ఏషర్ వన్ 10 ఆటమ్ టూ-ఇన్-వన్ ల్యాప్ ట్యాప్ ను రూ.9999కే ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. అంతేకాక ఇంటెల్ కోర్ ఐ5 ల్యాప్ ట్యాప్ ప్లు రూ.38,990 నుంచే ప్రారంభమవుతున్నాయి. 
 
ఈ కాలేజ్ సేల్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న డీల్స్ ఈవిధంగా ఉన్నాయి...
ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్ ట్యాప్ ల ధర రూ.22,990 ప్రారంభం,  ఈ ల్యాప్ టాప్ లపై అదనంగా 3వేల వరకు తగ్గింపు
టూ-ఇన్-వన్ ల్యాప్ టాప్ ల ధర రూ.23,990 నుంచి ప్రారంభం, గేమింగ్ ల్యాప్ టాప్ లు ఎక్స్చేంజ్ పై రూ.20వేల వరకు ఆఫర్ 
ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ కోర్ ఐ5 5వ తరం ల్యాప్ టాప్ ధర రూ.58,000, యాక్సిస్ బుజ్ క్రెడిట్ కార్డులపై అదనంగా 5 శాతం తగ్గింపు
 
అదేవిధంగా స్మార్ట్ ఫోన్లపై అందిస్తున్న డీల్స్ ఈ విధంగా ఉన్నాయి...
ఐఫోన్ 7 ప్లస్ 128జీబీపై 25 శాతం వరకు డిస్కౌంట్(82వేల రూపాయల అసలు ధర నుంచి రూ.59,999కి ధర తగ్గింపు)
ఐఫోన్ 7, 32జీబీ వేరియంట్ ధర రూ.60వేల నుంచి రూ.42,499కు తగ్గింపు
గూగుల్ పిక్సెల్ ఫోన్ రూ.57వేల నుంచి రూ.39,999కు దిగొచ్చింది. అదనంగా ఎక్స్చేంజ్ పై 2వేల తగ్గింపు
ఐఫోన్ మోడల్స్ పై కనీసం 2000 రూపాయల తగ్గింపు
ఇలా మరికొన్ని స్మార్ట్ ఫోన్లపై కంపెనీ డిస్కౌంట్లను, డీల్స్ ను ప్రవేశపెట్టింది. కాగ, 'బ్యాక్ టూ కాలేజ్' సేల్ నేటితో ముగుస్తుండగా.. డ్రీమ్ ఫోన్ సేల్ లు నేటి నుంచి 24వ తేదీ వరకు ఫ్లిప్ కార్ట్ నిర్వహించబోతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement