breaking news
Back to College Sale
-
విద్యార్థులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించిన అమెజాన్..!
కరోనా రాకతో స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. విద్యార్థుల కేవలం ఇంటికే పరిమితమయ్యారు. విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం కాకుండా ఉండడం కోసం ప్రభుత్వాలు ఆన్లైన్ విద్యను అమలులోకి తెచ్చాయి. టీచర్లు విద్యార్థులకు ఆన్లైన్లోనే క్లాసులను బోధిస్తున్నారు. కాగా నూతన విద్యా సంవత్సరం కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులు సన్నద్ధమవుతున్నారు. నూతన విద్యా సంవత్సరంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు, టీచర్ల కోసం అమెజాన్ ఇండియా ‘బ్యాక్ టూ కాలేజ్’ పేరిట సేల్‌ను ప్రారంభించింది. బ్యాక్ టూ కాలేజ్ సేల్ జూలై 31 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ సేల్‌లో భాగంగా ల్యాప్ టాప్‌లు, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్, ఇతర గాడ్జెట్స్‌పై 50 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. ఎంపిక చేయబడిన గాడ్జెట్స్‌పై విద్యార్థులకు ఎడ్టెక్ యాప్స్ నుంచి డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులపై ఆఫర్లను పొందవచ్చును. ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ కొనుగోలు చేస్తే వేదాంతు, టాప్పర్, అవిష్కార్, ప్రోగ్రాడ్, డిజిటల్ విద్యా వంటి ఎడ్యుకేషన్ యాప్‌లోని ఆన్లైన్ కోర్సులపై సుమారు రూ.20,000 వరకు తగ్గింపును అందిస్తోంది. నో కాస్ట్ ఈఎమ్ఐ ద్వారా కూడా గాడ్జెట్స్‌ను కొనుగోలు చేసేందుకు అమెజాన్ వీలు కల్పిస్తోంది. హెచ్‌పీ పెవిలియన్ కోర్ i5 11thGen ల్యాప్‌టాప్‌పై రూ. 10,000 తగ్గింపుతో రూ. 66, 940 కు అందించనుంది. ఇతర ల్యాప్‌టాప్ కొనుగోళ్లపై అడిషనల్ కూపన్లను అందించనుంది. -
ఫ్లిప్ కార్ట్ లో రూ.9999కే ల్యాప్ టాప్
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ల్యాప్ టాప్ లపై భారీగా డిస్కౌంట్లు, డీల్స్ ను ఆఫర్ చేస్తోంది. 'బ్యాక్ టూ కాలేజ్' సేల్ లో భాగంగా ఈ ఆఫర్లను తీసుకొచ్చింది. ల్యాప్ టాప్ లపై మాత్రమే కాక, స్మార్ట్ ఫోన్లపై కూడా ధర తగ్గింపు కోసం డ్రీమ్ ఫోన్ సేల్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. బ్యాక్ టూ కాలేజ్ సేల్ లో భాగంగా ఇంటెల్ ల్యాప్ టాప్ లు అత్యంత తక్కువగా రూ.9999కే అందుబాటులో ఉన్నాయి. ఏషర్ వన్ 10 ఆటమ్ టూ-ఇన్-వన్ ల్యాప్ ట్యాప్ ను రూ.9999కే ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. అంతేకాక ఇంటెల్ కోర్ ఐ5 ల్యాప్ ట్యాప్ ప్లు రూ.38,990 నుంచే ప్రారంభమవుతున్నాయి. ఈ కాలేజ్ సేల్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న డీల్స్ ఈవిధంగా ఉన్నాయి... ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్ ట్యాప్ ల ధర రూ.22,990 ప్రారంభం, ఈ ల్యాప్ టాప్ లపై అదనంగా 3వేల వరకు తగ్గింపు టూ-ఇన్-వన్ ల్యాప్ టాప్ ల ధర రూ.23,990 నుంచి ప్రారంభం, గేమింగ్ ల్యాప్ టాప్ లు ఎక్స్చేంజ్ పై రూ.20వేల వరకు ఆఫర్ ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ కోర్ ఐ5 5వ తరం ల్యాప్ టాప్ ధర రూ.58,000, యాక్సిస్ బుజ్ క్రెడిట్ కార్డులపై అదనంగా 5 శాతం తగ్గింపు అదేవిధంగా స్మార్ట్ ఫోన్లపై అందిస్తున్న డీల్స్ ఈ విధంగా ఉన్నాయి... ఐఫోన్ 7 ప్లస్ 128జీబీపై 25 శాతం వరకు డిస్కౌంట్(82వేల రూపాయల అసలు ధర నుంచి రూ.59,999కి ధర తగ్గింపు) ఐఫోన్ 7, 32జీబీ వేరియంట్ ధర రూ.60వేల నుంచి రూ.42,499కు తగ్గింపు గూగుల్ పిక్సెల్ ఫోన్ రూ.57వేల నుంచి రూ.39,999కు దిగొచ్చింది. అదనంగా ఎక్స్చేంజ్ పై 2వేల తగ్గింపు ఐఫోన్ మోడల్స్ పై కనీసం 2000 రూపాయల తగ్గింపు ఇలా మరికొన్ని స్మార్ట్ ఫోన్లపై కంపెనీ డిస్కౌంట్లను, డీల్స్ ను ప్రవేశపెట్టింది. కాగ, 'బ్యాక్ టూ కాలేజ్' సేల్ నేటితో ముగుస్తుండగా.. డ్రీమ్ ఫోన్ సేల్ లు నేటి నుంచి 24వ తేదీ వరకు ఫ్లిప్ కార్ట్ నిర్వహించబోతుంది.