ఈతకు వెళ్లిన యువకుడు చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన విజయనగరం జిల్లా సోమవారం చోటు చేసుకుంది.
చెరువులో పడి యువకుడి మృతి
Oct 3 2016 5:22 PM | Updated on Aug 1 2018 2:35 PM
జీయమ్మవలస: ఈతకు వెళ్లిన యువకుడు చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన విజయనగరం జిల్లా జీయ్యమ్మవలస మండలం పరజపాడులో గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మన్మధరావు(24) చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నీట మునిగి మృతి చెందాడా.. లేక స్నేహితులే హతమార్చి చెరువులో పడేశారా అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు.
Advertisement
Advertisement