రైతు రుణాలకు వడ్డీ మాఫీ | Waiver of interest on loans to farmers | Sakshi
Sakshi News home page

రైతు రుణాలకు వడ్డీ మాఫీ

Oct 1 2015 2:22 AM | Updated on Jun 4 2019 5:04 PM

రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో మధ్య, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలకు సంబంధించి ఈ ఏడాది

మంత్రి మహదేవప్రసాద్
బెంగళూరు : రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో మధ్య, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలకు సంబంధించి ఈ ఏడాది చెల్లించాల్సిన వడ్డీని మాఫీ చేస్తున్నట్లు రాష్ట్ర సహకారశాఖ మంత్రి హెచ్.ఎస్ మహదేవప్రసాద్ వెల్లడించారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.296.62 కోట్ల భారం పడనుందన్నారు. బెంగళూరులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన బుధవారం మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల వల్ల  కష్టాల్లో  ఉన్న రైతులను ఆదుకునే ఉద్దేశంతో ఈ ఏడాదికి సంబంధించిన వడ్డీని మాఫీ చేస్తున్నామన్నారు.

అదేవిధంగా తీసుకున్న రుణంలో ఈ ఏడాదికి చెల్లించాల్సిన అసలు మొత్తాన్ని కూడా వచ్చే ఏడాది చెల్లించే వెసులుబాటు కల్పించనున్నామని మంత్రి వివరించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రుణ మాఫీ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. రైతులకు వ్యవసాయ రుణాలు అందించే విషయంలో రాష్ట్రంలోని వాణిజ్య బ్యాంకులు  నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement