కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రకటించిన ఆర్ధిక సాయం ఏమాత్రం సరిపోదని మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు విమర్శించారు.
కేంద్ర సాయం ఏమాత్రం సరిపోదు: వడ్డే
Sep 9 2016 4:18 PM | Updated on Mar 23 2019 9:10 PM
విజయవాడ: కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రకటించిన ఆర్ధిక సాయం ఏమాత్రం సరిపోదని మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు విమర్శించారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.3500 కోట్లు ఇస్తే.. ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై టీడీపీ ప్రభుత్వం అఖిలపక్షాన్ని కలుపుకుని కేంద్రంపై పోరాడాలన్నారు. రూ.32 వేల కోట్లు అవసరమయ్యే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం రూ.8 వేల కోట్లే ఇస్తామనడం సరికాదన్నారు.
Advertisement
Advertisement