ఆ చిత్రంలో త్రిష లేదు | Trisha not act in hero Jay movie | Sakshi
Sakshi News home page

ఆ చిత్రంలో త్రిష లేదు

Mar 26 2015 2:13 AM | Updated on Sep 2 2017 11:22 PM

ఆ చిత్రంలో త్రిష లేదు

ఆ చిత్రంలో త్రిష లేదు

నటి త్రిష వరుణ్‌మణియన్ త్వరలో పెళ్లికి సిద్ధం అవుతున్న జంట అన్న విషయం తెలిసిందే.

నటి త్రిష వరుణ్‌మణియన్ త్వరలో పెళ్లికి సిద్ధం అవుతున్న జంట అన్న విషయం తెలిసిందే. వీరి వివాహా నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి అయ్యే వరకే కాదు ఆ తరువాత కూడా నటనకు దూరం కాను అని నిక్కచ్చిగా చెప్పిన త్రిష అన్నట్టుగానే తమిళం, తెలుగు భాషలలో నటిస్తూ బిజీగా వున్నారు. త్రిషకు కాబోయే భర్త వ్యాపారవేత్త, నిర్మాత అన్న విషయం తెలిసిందే. ఇంతకుముందు వాయై మూడి పేసవుం మొదలగు కొన్ని చిత్రాలు నిర్మించారు. తాజాగా యువ నటుడు జయ్ హీరోగా నాన్ శివప్పు మనిదన్ చిత్రం ఫేమ్ తిరు దర్శకత్వంలో చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో జయ్ సరసన త్రిష నటిస్తారనే ప్రచారం జరిగింది.
 
  అయితే ఇప్పుడా చిత్రంలో త్రిష నటించడం లేదట. కారణం ఇతర చిత్రాలతో ఆమె బిజీగా ఉండటమేనని త్రిష పేర్కొన్నారు.ఈ బ్యూటీ ప్రస్తుతం జయం రవి సరసన అప్పాటక్కర్, బోగి చిత్రాలతో పాటు తన మేనేజర్ గిరిధర్  నిర్మించనున్న ద్విభాషా చిత్రం నటించడానికి సమ్మతించారు. అదే విధంగా బాలకృష్ణ సరసన లయన్ అనే తెలుగు చిత్రంలోను నటిస్తున్నారు. దీంతో కాల్‌షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో తన కాబోయే భర్త చిత్రం నుంచి వైదొలగినట్లు త్రిష వివరణ ఇచ్చారు. అయితే త్రిష వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నారా? లేక మరేమైనా కారణం ఉందా? అని ఆరా తీసేపనిలో పడింది కోలీవుడ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement