ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 211 ఐఏఎస్‌లను మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిల్లో ఇప్పటికే 171 పోస్టులు భర్తీ చేశామని.. వారు విధులు కూడా నిర్వర్తిస్తున్నారని తెలిపింది.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 211 ఐఏఎస్‌లను మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిల్లో ఇప్పటికే 171 పోస్టులు భర్తీ చేశామని.. వారు విధులు కూడా నిర్వర్తిస్తున్నారని తెలిపింది. త్వరలోనే మిగితా ఖాళీలను పూరిస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సిబ్బంది వ్యవహారాలశాఖ సహాయ మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. గత నాలుగేళ్లుగా కేంద్రం ఏడాదికి 180 మంది ఐఏఎస్‌లను తీసుకుంటున్నామని చెప్పారు.
దేశంలోని ఐఐటీల్లో ఉన్న విద్యార్థులు, వాటి పనితీరు, అధ్యాపక వ్యవస్థ ఉన్న విధానంపై విజయసాయిరెడ్డి మరో ప్రశ్న అడిగారు. ఇందుకు లిఖిత పూర్వకంగా కేంద్ర మానవ వనరులశాఖ సహాయ మంత్రి సమాధానం ఇస్తూ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో ప్రస్తుతం 82,604మంది విద్యార్థులు ఉన్నారని ఆగస్టు 23న ఐఐటీ కౌన్సిల్ నిర్వహించిన 50వ సమావేశంలో ఆ సంఖ్యను ఒక లక్ష వరకు పెంచాలని నిర్ణయించారని, ఇది 2020నాటికి అమలులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
బహిరంగ ప్రకటనల ద్వారా, పత్రికల్లో ప్రకటించడం ద్వారా సమర్థులైన అధ్యాపక బృందాన్ని తీసుకుంటున్నట్లు వివరించారు. కొన్ని శాశ్వత ప్రాతిపదికన, మరికొన్ని కాంట్రాక్టు పద్థతిలో ఇంకొన్ని గెస్ట్‌ప్యాకల్టీలుగా రప్పించి విద్యార్థులకు మెరుగైన, నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.