ప్రత్యేక యాగం కోసం ఇలా చేశాడు..! | swamiji sacrifice the child for special yagam in tamilnadu | Sakshi
Sakshi News home page

ప్రత్యేక యాగం కోసం ఇలా చేశాడు..!

Aug 9 2017 7:53 PM | Updated on Sep 11 2017 11:41 PM

తమిళనాడులోని వేలూరు జిల్లా వానియంబాడిలోని స్వామిజీ మఠంలో చిన్నారి మృతి చెందాడు.

వేలూరు: ప్రపంచం కొత్త కొత్త టెక్నాలజీతో రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. కానీ సమాజంలో మాత్రం మూఢనమ్మకాలు పోవటం లేదు . టెన్నాలజీ యుగంలో కూడా స్వామిజీలకు, బాబాలకు ఆధరణ మంచిగానే ఉంది. ప్రత్యేక యాగం కోసం చిన్నారిని బలి ఇచ్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని వేలూరు జిల్లా వానియంబాడిలోని స్వామిజీ మఠంలో చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన గ్రామస్తులలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. నరబలి ఇచ్చి నీటి తొట్టెలో వేశారంటూ స్థానికులు మఠాన్ని ధ్వంసం చేశారు.

వివరలీవి.. వానియంబాడి తాలుకా మేల్ నిమ్మయంబట్టు గ్రామ సమీపంలో రవి అనే వ్యక్తి మఠం ఏర్పాటు చేసి పదేళ్లుగా అక్కడే ఉంటున్నాడు. ఏడడుగుల నీటి తొట్టెను ఏర్పాటు చేసి అందులో తాబేలను పెంచుతున్నాడు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగం చేస్తుంటాడు. మఠానికి సమీపంలోనే మురుగన్ కుటుంబంతో ఉంటున్నాడు. మంగళవారం  అతని కుమారుడు హరికేష్ అలియాస్ తులసి(2) కనిపించకుండా పోయాడు.

విషయం తెలుసుకున్న కుటుంబీకులు మఠంలో వెదకగా నీటి తొట్టెలో శవమై కనిపించాడు. సోమవారం రోజున పౌర్ణమి, చంద్ర గ్రహణం కావడంతో స్వామిజీ రవి ప్రత్యేక యాగం చేశాడని, ఆ సమయంలో బాలుడిని బలి ఇచ్చి ఉంటాడని గ్రామస్తులు అనుమానించారు.  కోపంతో గ్రామస్తులు మఠంలో ఉన్న స్వామిజీపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. మఠంలోని సామాగ్రిని ధ్వంసం చేశారు.  గాయపడిన రవి అక్కడి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. బాలుడిని బలి ఇచ్చాడంటూ రవిపై వానియంబాడి పోలీసులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement