మాజీ సీఎం కుమార్తెపై తప్పుడు ప్రచారం | Sushilkumar Shinde's Daughter Trolled For Accident She Did Not Cause | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం కుమార్తెపై తప్పుడు ప్రచారం

Apr 20 2017 2:58 PM | Updated on Sep 5 2017 9:16 AM

మాజీ సీఎం కుమార్తెపై తప్పుడు ప్రచారం

మాజీ సీఎం కుమార్తెపై తప్పుడు ప్రచారం

ఏ మాత్రం సంబంధం లేని కేసులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే కుటుంబాన్ని, ఆయన రెండో కుమార్తె ప్రీతి ష్రాఫ్‌ను సోషల్ మీడియాలో టార్గెట్‌ చేశారు.

ముంబై: ఏ మాత్రం సంబంధం లేని కేసులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే కుటుంబాన్ని, ఆయన రెండో కుమార్తె ప్రీతి ష్రాఫ్‌ను సోషల్ మీడియాలో టార్గెట్‌ చేశారు. ప్రీతి ఇంటిపేరు (ష్రాఫ్‌) కలిగిన మరో మహిళను చేసిన తప్పును ఆమె చేసినట్టుగా నెటిజెన్లు మెసేజ్‌లు పెట్టారు. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు షిండే కుటుంబంలో కలకలం రేపాయి. చివరకు ప్రీతి, ఆమె భర్త మీడియా ముందుకు వచ్చిన వివరణ ఇవ్వడంతో తప్పుడు ప్రచారానికి ఫుల్‌ స్టాప్‌ పడింది.

గత సోమవారం పుణెలో కారు నడుపుకొంటూ వెళ్తున్న ఓ మహిళ ఫుట్‌పాత్‌పై నిల్చున్నవారిని ఢీకొట్టడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ యాక్సిడెంట్‌ చేసింది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి భార్య సుజాత జయప్రకాశ్‌ ష్రాఫ్‌ కాగా నెటిజెన్లు షిండే కుమార్తె ప్రతీ ఫ్రాష్‌ చేసినట్టుగా భావించారు. ప్రీతి ఫుట్‌పాత్‌పై ఉన్నవారిపై కారు నడిపి ఇద్దరి మరణానికి కారణమయ్యారంటూ సోషల్‌ మీడియాలో మెసేజ్‌లు పంపారు. ఏం జరిగిందంటూ షిండే కుటుంబ సభ్యుల స్నేహితులు ఆరా తీశారు. ఈ పుకార్లు విని షిండే కుటుంబ సభ్యులు షాకయ్యారు.

కాంగ్రెస్‌ నేత, వ్యాపారవేత్త రాజ్‌ ష్రాఫ్‌ను ప్రీతి వివాహం చేసుకున్నారు. రాజ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ రూమార్లపై ఎలా స్పందించాలో అర్థంకావడం లేదని అన్నారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా, ప్రమాదానికి కారణం ఎవరో తెలుసుకోకుండా తమపై సోషల్‌ మీడియాలో ఎవరు ఎందుకిలా తప్పుడు ప్రచారం చేశారు? కనీసం పేపర్‌లో వచ్చిన వార్తను కూడా చదవకుండా తమపై నిందలు వేస్తారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈ దుష్ప్రచారాన్ని ఆపి, నిందితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పుణె పోలీస్‌ కమీషనర్‌ను ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement