టోయింగ్ వ్యాన్‌లపై నిఘా | surveillance on Towing vans | Sakshi
Sakshi News home page

టోయింగ్ వ్యాన్‌లపై నిఘా

May 3 2015 11:42 PM | Updated on Sep 17 2018 6:20 PM

రాష్ట్రంలో తొలిసారిగా పోలీస్ టోవింగ్ వ్యాన్‌లపై ఎలక్ట్రానిక్ నిఘా ఉంచనున్నారు...

- థానేలో త్వరలో ఏర్పాటు
సాక్షి, ముంబై:
రాష్ట్రంలో తొలిసారిగా పోలీస్ టోవింగ్ వ్యాన్‌లపై ఎలక్ట్రానిక్ నిఘా ఉంచనున్నారు. ఇందుకోసం హైటెక్ సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షణ వ్యవస్థను అమర్చనున్నారు. దీంతో ఈ వ్యవస్థ కలిగిన మొదటి పట్టణంగా థానే పేరు గడించనుంది. టోవింగ్ వ్యాన్‌లపై వాహనదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ వ్యవస్థను అమర్చాలని నిర్ణయించినట్లు సమాచారం. టోవింగ్ సిబ్బంది ద్వారా తరలించే వాహనాలు పాడవుతున్నాయని తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి.

వాహనాల కదలికలు సాఫీగా సాగేందుకే వాహనాలను టోవ్ చేస్తుంటామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. థానే ట్రాఫిక్ డీసీపీ రష్మి కరందీకర్ యుద్ధ ప్రాతిపదికన పైలట్ ప్రాజెక్టుగా ఇటీవలే ప్రారంభించారు. టోవింగ్ వ్యాన్ యజమానులకు సీసీటీవీ కెమెరాలను అమర్చుకోవాల్సిందిగా పోలీసులు సూచించారు. మరో రెండు రోజుల్లో థానేలోని అన్ని టోవింగ్ వాహనాలకు కెమెరాలను అమర్చుకోవాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement