ఆ సూట్‌కేసు మిఖైల్‌ను చంపి దాచేందుకేనా? | suitcase has been found at sheenabora's death spot | Sakshi
Sakshi News home page

ఆ సూట్‌కేసు మిఖైల్‌ను చంపి దాచేందుకేనా?

Aug 31 2015 10:36 AM | Updated on Sep 3 2017 8:29 AM

ఆ సూట్‌కేసు మిఖైల్‌ను చంపి దాచేందుకేనా?

ఆ సూట్‌కేసు మిఖైల్‌ను చంపి దాచేందుకేనా?

ఆ సూట్‌కేస్ షీనా సోదరుడు మిఖైల్‌ను హత్య చేసి అందులో దాచేందుకే సమీకరించారని పోలీసుల అనుమానం.

ముంబై:  షీనా బోరా హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు.  ఆదివారం షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జీయాకు చెందిన ముంబై నివాస ప్రాంతంలో వారు ఓ సూట్‌కేసును స్వాధీనం చేసుకున్నారు. ఈ సూట్‌కేస్ షీనా సోదరుడు మిఖైల్‌ను హత్య చేసి అందులో దాచి అటవీ ప్రాంతంలో షీనా హత్య చేసిన ప్రాంతంలోనే ఖననం చేసేందుకు సమీకరించారని పోలీసుల అనుమానం.

కాగా, ఆధారాల సేకరణ కోసం షీనా హత్య జరిగిన తీరును తెలుసుకోవడానికి ఈ కేసులో నిందితులైన ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్‌లను ముంబై పోలీసులు ఆదివారం రాయ్‌గఢ్ జిల్లా అడవికి తీసుకెళ్లారు.   ఇంద్రాణి, ఖన్నాలు హత్యకు కారణం నువ్వంటే.. నువ్వని పరస్పరం ఆరోపణలకు దిగారని పోలీసులు తెలిపారు.

ఈ హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ముంబై పోలీసులు.. నిందితులైన ఇంద్రాణి ముఖర్జియా, ఆమె రెండో భర్త సంజీవ్ ఖన్నా, ఇంద్రాణి కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ లను సోమవారం స్థానిక కోర్టులో హాజరుపర్చనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement