విద్యార్థిని ఆత్మహత్య | Student suicide | Sakshi
Sakshi News home page

విద్యార్థిని ఆత్మహత్య

Published Sun, Jun 28 2015 3:11 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

Student suicide

సేలం: సేలంలోని ఓ హాస్టల్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఉరి పోసుకుని వేలాడుతున్న స్థితి అనుమానాలకు తావిస్తోంది. సేలం శంకగిరికి చెందిన పన్నీరు సెల్వం, ఉమా దంపతుల కుమార్తె ప్రియదర్శిని చిన్నప్పం పట్టిలోని  ప్రభుత్వ పాఠశాలలో తొ మ్మిదో తరగతి చదువుతోంది. శుక్రవారం ఆమెను ఆ పాఠశాల్లో చేర్పిం చారు. ఆ పాఠశాలకు చెందిన హాస్టల్‌లో ఆమెకు బస సౌకర్యం కల్పించా రు. ఈ పరిస్థితుల్లో శనివారం ఉద యం ప్రియదర్శిని శవంగా మారింది. దుపట్టాతో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆ హాస్టల్ వర్గాలు పేర్కొన్నాయి.
 
 అయితే, కిటికీలకు ఉ న్న ఇనుప రాడ్డు సాయంతో దుపట్టా ను ఉపయోగించి గొంతు బిగిసి ఉం డడం, రెండు కాళ్ల మోకాళ్లు నేలను తాకుతుండడంతో అనుమానాలు బ యల్దేరాయి. అయితే, స్కూలుకు ఆల స్యంగా వెళ్లినందుకు టీచరు మందలించినట్టు అందుకే ఆ బాలిక ఆత్మహత్య చేసుకున్నట్టుగా హాస్టల్ వర్గా లు పేర్కొంటున్నాయి. అయితే, ఆ బాలిక మృతి మిస్టరీని ఛేదించాలని డిమాండ్ చేస్తూ ఆ పరిసరవాసులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన కారుల్ని కట్టడి చేయడానికి పోలీసులు శ్రమిం చాల్సి వచ్చింది. చివరకు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement