గాయకుడు సోనూనిగంకు మాఫియా ముఠా నాయకుడు దావూద్ ఇబ్రహీం అనుచరుడైన ఛోటా షకీల్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.
సోనూనిగంకు బెదిరింపు కాల్
Oct 3 2013 11:08 PM | Updated on Sep 1 2017 11:18 PM
సాక్షి,ముంబై: గాయకుడు సోనూనిగంకు మాఫియా ముఠా నాయకుడు దావూద్ ఇబ్రహీం అనుచరుడైన ఛోటా షకీల్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ఈ విషయాన్ని వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు. వేరే సంస్థతోకుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దుచేసుకుని, తమ సంస్థతో కుదుర్చుకోవాలంటూ బెదిరించారని నిగం చెప్పారు. ఇలా చేయని పక్షంలో ఓ మహిళతో అక్రమ సంబంధం అంటగట్టి పరువు తీస్తామంటూ బెదిరించినట్లు వివరించారు. ఈ కాల్ పాకిస్థాన్‌నుంచి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. కాగా నిగం ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. స్వస్థలానికి చేరుకున్న అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నాడు. గత నెలలోనూ నిగంకు అనేకసార్లు ఇలాగే బెదిరింపు ఫోన్‌కాల్‌లొచ్చాయి. అయితే వేటికీ స్పందించకపోవడంతో ఎస్‌ఎంఎస్ ద్వారా బెదిరించారు. గతంలో ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు కరణ్ జోహార్, బోనీకపూర్‌లకు కూడా ఇలాగే ఛోటా షకీల్ నుంచి బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement