తల్లిని బంధించి డబ్బుతో పరారీ | son attacked on his mother and carry money in bangalore | Sakshi
Sakshi News home page

తల్లిని బంధించి డబ్బుతో పరారీ

Mar 2 2016 12:35 PM | Updated on Sep 3 2017 6:51 PM

కన్న కొడుకే తల్లిని బంధించి ఇంటిలోని నగదు తీసుకుని ఉడాయించిన సంఘటన మంగళవారం మైసూరులో చోటుచేసుకుంది.

బెంగళూరు: కన్నకొడుకే తల్లిని బంధించి ఇంటిలోని నగదు తీసుకుని ఉడాయించిన సంఘటన మంగళవారం మైసూరులో చోటుచేసుకుంది. లష్కర్‌మోహాల్ల ప్రాంతంలో నివాసముంటున్న శమీమజాన్ (35) ఇంటిలో ఒంటరిగా ఉండగా లోనికి ప్రవేశించిన ఆమె కుమారుడు అమానుల్లా, ఇంటి సమీపంలో ఉండే అమీరాబేగం కత్తులతో బెదిరించి కాళ్లు, చేతులు కట్టివేసి గాయపరిచి ఇంటిలో ఉన్న రూ. 6 లక్షల నగదుతో ఉడాయించారు.

కొద్దిసేపు అనంతరం  శమీమ మరిది ఇంటికి రావడంతో విషయం వెలుగు చూసింది. విషయం గుర్తించిన ఆయన బాధితురాలిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాధితురాలిని విచారణ చేయడంతో తన కుమారుడే ఈ దారుణానికి ఒడిగట్టాడని చెప్పడంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే  కొన్ని రోజుల క్రితం అమీరా బేగంకు, శమీమ భర్త అప్సర్ అహ్మద్‌కు మధ్య గొడవ జరిగింది. చివరికి అది పోలీస్ స్టేషన్కు చేరింది. దాంతో లష్కర్‌ పోలీసులు ఇరుకుటుంబాల వారిని పిలిచి రాజీ చేసి పంపించారు. అదే పగను పెంచుకొన్న అమీరా మంగళవారం ఇంట్లో ఎవరు లేని సమయం చూసి తన కొడుకుతో కలిసి ఇలా చేసిందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement