సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య | software engineer suicide in chennai | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

Apr 13 2016 8:53 AM | Updated on Nov 6 2018 7:56 PM

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య - Sakshi

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

భార్య, కుమార్తె ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తట్టుకోలేక విరక్తి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

కేకే.నగర్: భార్య, కుమార్తె ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తట్టుకోలేక విరక్తి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై షెహనాయ్‌నగర్ కదిరవన్ కాలనీకి చెందిన నరేంద్రన్ (34) సాఫ్ట్‌వేర్  ఇంజినీర్. ఇతని భార్య సంగీత. వీరికి ఒకటిన్నర ఏడాది వయసు గల మోనిషా అనే కుమార్తె ఉంది. ఈ దంపతులు ఆవడి సేక్కాడు ప్రాంతంలో అద్దె ఇంటిలో నివసించారు. ఈ క్రమంలో దంపతుల మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడ్డాయి.

దీంతో విరక్తి చెందిన సంగీత గత ఏడాది బిడ్డ సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. దీంతో మతిస్థిమితం కోల్పోయిన నరేంద్రన్ ఎక్కడికి వెళ్లకుండా ఇంటిలోనే ఉండేవాడు. కుమార్తె జ్ఞాపకాల నుంచి బయటపడలేకపోయాడు. సోమవారం సాయంత్రం నరేంద్రన్ పట్టాభిరామ్ రైల్వేస్టేషన్ సమీపంలో చెన్నై నుంచి వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

సమాచారం అందుకున్న ఆవడి రైల్వేపోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నరేంద్రన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి పంపారు. సంఘటన స్థలంలో నరేంద్రన్ రాసిన ఐదు పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నరేంద్రన్ కుమార్తె మోనిషా రెండో సంవత్సరం పుట్టిన రోజు కావడం వలన ఇతడు ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement