సేవాభారత్ ట్రస్టు దాతృత్వం | Sevabharat Trust charity | Sakshi
Sakshi News home page

సేవాభారత్ ట్రస్టు దాతృత్వం

Oct 13 2013 2:55 AM | Updated on Sep 29 2018 5:52 PM

నగరంలోని సేవాభారత్ ట్రస్టు దాతృత్వాన్ని చాటుకుంది. రెండు నెలలుగా సమైకాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు...

 బెంగళూరు,న్యూస్‌లైన్ : నగరంలోని సేవాభారత్ ట్రస్టు దాతృత్వాన్ని చాటుకుంది. రెండు నెలలుగా సమైకాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు దసరా పండుగ సందర్భంగా ట్రస్టు తరఫున నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శనివారం కెంపేగౌడ బస్టాండ్‌లో ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద 18 కుటుంబాలకు 25 కిలోలు చొప్పున బియ్యం, కిలో కందిపప్పు, చక్కెర, గోధుమపిండి,  లీటరు వంటనూనె  ట్రస్ట్ తరఫున విశ్రాంత ఉపాధ్యాయుడు రంగస్వామినాయుడు అందజేశారు.

అనంతరం ట్రస్టు అధ్యక్షుడు బండి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ ఉద్యమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులను ఆదుకునేందుకు ప్రవాసాంధ్రులు ముందుకు రావాలన్నారు.  చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి సాధ్యం కాదనేందుకు జార్ఖండ్, ఉత్తరాంచల్ తదితర రాష్ట్రాలే నిదర్శనమన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఒకే భాష కలిగిన తెలుగు ప్రజలందరూ కలిసి ఉండేలా సమైక్యాంధ్ర సాధనకు కృషి చేయాలన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement