భారత్‌ గ్యాస్‌ గోడౌన్‌లో చోరీ | robbery in bharat gas godam | Sakshi
Sakshi News home page

భారత్‌ గ్యాస్‌ గోడౌన్‌లో చోరీ

May 6 2017 11:28 AM | Updated on Oct 17 2018 6:06 PM

నిజామాబాద్‌ జిల్లా వర్నిలో వింత చోరీ వెలుగుచూసింది. పట్టణ శివారులోని భారత్‌ గ్యాస్‌ గోడౌన్‌లో దొంగలుపడి సిలిండర్లు ఎత్తుకెళ్లారు.

వర్ని: నిజామాబాద్‌ జిల్లా వర్నిలో వింత చోరీ వెలుగుచూసింది. పట్టణ శివారులోని భారత్‌ గ్యాస్‌ గోడౌన్‌లో దొంగలుపడి సిలిండర్లు ఎత్తుకెళ్లారు. నిన్న సాయంత్రమే గోడౌన్‌కు వచ్చిన 250 గ్యాస్‌ సిలిండర్లలో శుక్రవారం రాత్రి 204 సిలిండర్లు చోరీకి గురయ్యాయి. శనివారం ఉదయం గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ శేఖర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. డీసీఎం లాంటి వాహనంలో సిలిండర్లు తరలించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement