విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కు ఘననివాళి | Rich Tribute to Vilasrao | Sakshi
Sakshi News home page

విలాస్‌రావ్‌కు ఘననివాళి

Aug 15 2013 6:36 AM | Updated on Sep 1 2017 9:51 PM

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తొలి వర్ధంతి పురస్కరించుకొని రాష్ర్టవ్యాప్తంగా బుధవారం ఆయనకు ఘన నివాళులు ఆర్పించారు.

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తొలి వర్ధంతి పురస్కరించుకొని రాష్ర్టవ్యాప్తంగా బుధవారం ఆయనకు ఘన నివాళులు ఆర్పించారు. సొంతూరైన లాతూర్ జిల్లాలోని బహల్‌గావ్ గ్రామంలో విలాస్‌రావ్‌కు అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశం వద్ద ఆయన భార్య వైశాలితో పాటు వేలాది మంది నివాళులు ఆర్పించారు. వైశాలి వెంట ఆమె కుమారులు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అమిత్, బాలీవుడ్ నటుడు రితేశ్, ధీరాజ్‌లు ఉన్నారు.
 
అలాగే విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ సెంటర్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించింది. ఫ్రధానంగా సామాజిక సమస్యలకు ప్రాధాన్యతనిచ్చింది. ముంబైలోని వైబీ చవాన్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు హాజరై విలాస్‌రావ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. కాలేయ క్యాన్సర్ వ్యాధి బారిన పడిన విలాస్‌రావ్ గతేడాది ఆగస్టు 14న చెన్నై ఆస్పత్రిలో మరణించిన సంగతి తెలిసిందే. తర్వాత రోజు బహల్‌గావ్‌లో జరిగిన  అంత్యక్రియలకు ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా హాజరయ్యారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement