నోయిడా భూ కుంభకోణంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన రియల్‌ఎస్టేట్ వ్యాపారి శివేందర్‌సింగ్ బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది.
రియల్ వ్యాపారి బెయిల్ తిరస్కృతి
Feb 23 2014 10:41 PM | Updated on Sep 2 2017 4:01 AM
న్యూఢిల్లీ: నోయిడా భూ కుంభకోణంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన రియల్‌ఎస్టేట్ వ్యాపారి శివేందర్‌సింగ్ బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. రాజకీయ నాయకుల మద్దతుతో, మాఫియా అండదండలతో వ్యవసాయభూమిని సొంతం చేసుకున్నారని, చట్టమంటే భయం లేనట్లుగా వ్యవహరించారని అడిషనల్ సెషన్స్ జడ్జి కామిని లావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆర్థిక నేరాల విభాగం పోలీసులు, ఢిల్లీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని కోర్టు పేర్కొంది. సంబంధిత అధికారులను కూడా విచారించాల్సిందేనని కోర్టు అభిప్రాయపడింది.‘పట్టుబడిన నింది తుడు చట్టాన్ని లెక్కచేయకుండా వ్యవహరించాడు. ఖజానాకు 12.5 కోట్ల రూపాయల నష్టం కలిగించాడు. అతనికి తండ్రి, సహనిందితుడు అయిన మహేందర్‌సింగ్ ఇంకా పరారీలోనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో శివేందర్‌సింగ్‌కు బెయిల్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వడం సరికాద’ న్యాయమూర్తి పేర్కొన్నారు.
Advertisement
Advertisement