ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వండి.. | ramagundam police commissioner review meeting with police | Sakshi
Sakshi News home page

ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వండి..

Oct 14 2016 8:51 AM | Updated on Sep 4 2017 5:12 PM

ప్రజలకు అందుబాటులో సేవలందించేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యతనివ్వాలని రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ కోరారు.

మంచిర్యాల జిల్లా పోలీస్ అధికారులతో
కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్
 
గోదావరిఖని : ప్రజలకు అందుబాటులో సేవలందించేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యతనివ్వాలని రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ కోరారు. గురువారం గోదావరిఖనిలోని సింగరేణి ఇల్లందు క్లబ్‌లో మంచిర్యాల జిల్లా పోలీస్ అధికారులతో సమావేశమై సమీక్ష చేశారు. కిందిస్థాయి పోలీసులు ప్రజలకు మరింత దగ్గరగా ఉంటూ వారికి సేవలందించాలని, అప్పుడే నేరాల నియంత్రణ ఉంటుందని, ప్రజలు భరోసాగా ఉండే వీలు కలుగుతుందన్నారు.
 
 కొత్త కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలను పరిరక్షించాలని సూచిస్తూ స్టేషన్ల వారిగా ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ జాన్‌వెస్లీ, బెల్లంపల్లి ఏసీపీ రమణారెడ్డి, మంచిర్యాల సిఐ డి.సుధాకర్, మందమర్రి సిఐ పి.సదయ్య, లక్షెట్టిపేట సిఐ డి.మోహన్, ఐ.ప్రవీన్‌కుమార్, ఖరీముల్లా, ఎల్.రఘు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement