మాకు రక్షణ కల్పించండి | please protection new lovers | Sakshi
Sakshi News home page

మాకు రక్షణ కల్పించండి

Mar 6 2016 3:25 PM | Updated on Sep 3 2017 7:09 PM

మాకు రక్షణ కల్పించండి

మాకు రక్షణ కల్పించండి

తమకు రక్షణ కల్పించాల్సిందిగా బుక్కరాయసముద్రం మండలం జంతులూరు గ్రామానికి చెందిన ప్రేమజంట

 సాక్షి, బెంగళూరు : తమకు రక్షణ కల్పించాల్సిందిగా  బుక్కరాయసముద్రం మండలం జంతులూరు గ్రామానికి చెందిన ప్రేమజంట రాధిక(19), నాగరాజు  వేడుకుంటున్నారు. వీరిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులతో పాటు వారి బంధువులు అంగీకరించకపోవడంతో ఇద్దరూ గ్రామం వదిలి వెళ్లిపోయారు. అప్పటి నుంచి రాధిక బంధువులు నాగరాజు అమ్మతో పాటు బంధువులను ఇబ్బందులు పెడుతున్నారని వీరు చెబుతున్నారు.
 
  నాగరాజు తల్లితో పాటు అతని బంధువులపై కూడా భౌతిక దాడులకు దిగుతున్నారని ప్రేమికులు ఇద్దరూ బెంగుళూరులో ‘సాక్షి’తో వాపోయారు. ఈ విషయమై రాధిక మాట్లాడుతూ...‘మా అమ్మనాన్నలకు మా వివాహం ఇష్టమే. అయితే బంధువుల ఒత్తిడితో వారు మా పెళ్లికి అంగీకరించడం లేదు. ముఖ్యంగా టీడీపీ వారి అండతో మా చిన్నాన్న నాగభూషణం, పెదనాన్న గోపాల్ నాయుడు, మరో పెదనాన్న, సర్పంచ్ రామానాయుడుతో పాటు మామ ధనుంజయ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
 
 నాగరాజు ప్రాణాలు తీయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇందుకు స్థానిక పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారు. నాగరాజుతో పాటు వాళ్ల అమ్మ, చెల్లెలు, బావమరిదితో పాటు నాకు ఎటువంటి హాని జరిగినా వీరే కారణమవుతారు’ అని తెలిపింది. తాను మేజర్‌నని, తన ఇష్టపూర్వకంగానే నాగరాజుతో కలిసి ఇంటి నుంచి వచ్చేశానని చెప్పింది. నాగరాజును తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని రాధిక తన తల్లిదండ్రులు, బంధువులను కోరింది.
 

Advertisement
 
Advertisement
Advertisement