అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత | pds rice seized in guntur district | Sakshi
Sakshi News home page

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

Oct 9 2016 8:06 AM | Updated on May 29 2018 2:33 PM

గుంటూరు జిల్లా దుర్గి మండలం నరమాలపాడు వద్ద ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పట్టుకున్నారు.

గుంటూరు : గుంటూరు జిల్లా దుర్గి మండలం నరమాలపాడు వద్ద ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని వైఎస్ఆర్ సీపీ నాయకుడు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 420 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే లారీని కూడా స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement