శాసనసభను కుదిపేసిన ‘పరిహారం’ | opposition to hold a debate on farmer suicides | Sakshi
Sakshi News home page

శాసనసభను కుదిపేసిన ‘పరిహారం’

Jul 31 2015 1:30 AM | Updated on Sep 3 2017 6:27 AM

బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు పరిహారం అందించే విషయం రాష్ట్ర శాసనసభను గురువారం

రైతు ఆత్మహత్యలపై చర్చకు విపక్షాల పట్టు
లోకాయుక్త ముసాయిదా బిల్లుపై చర్చ జరగాలన్న ప్రభుత్వం
సభలో గందరగోళం... వాయిదా
 
 బాధితులకు అందని సాయం : శెట్టర్
పరిహారం అందజేతలో ఆలస్యం లేదు : కృష్ణబైరేగౌడ

 
బెంగళూరు : బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు పరిహారం అందించే విషయం రాష్ట్ర శాసనసభను గురువారం కుదిపేసింది. అధికార విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం చేసుకోవడంతో పరిస్థితిని యథాస్థితికి తీసుకురావడానికి స్పీకర్ కాగోడు తిమ్మప్ప కొద్ది సేపు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. శాసనసభ కార్యక్రమాల్లో భాగంగా విపక్షనాయకుడు జగదీష్ శెట్టర్ మాట్లాడుతూ...‘ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదు. ఇంకా చాలా మంది బాధిత కుటుంబాలకు పరిహారం కూడా అందలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు చట్టపరమైన అడ్డంకులు కూడా ఉన్నాయి. పరిహారం అందించే విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలను మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై చట్టసభలో చర్చించడానికి అనుమతి ఇవ్వాలి.’ అని స్పీకర్‌కు విన్నవించారు. ఇందుకు మిగిలిన బీజేపీ నాయకులైన విశ్వేశ్వర హెగ్డే కాగేరి, సీ.టీ రవి కూడా మద్దతు పలికారు. ఇందుకు అధికార పక్షం నాయకులు అడ్డు చెప్పారు. ఈ సమయంలో శాసనసభలో ఉన్న వ్యవసాయ శాఖ మంృతి కష్ణభైరేగౌడ మాట్లాడుతూ... పరిహారం ఇవ్వడంలో ఎటువంటి ఆలస్యం జరగడం లేదన్నారు. రైతుల బలవన్మరణాలను కూడా రాజకీయం చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు.

ఈ వాఖ్యలతో విపక్షనాయకులు రెచ్చిపోయారు. పరిహారం చెల్లింపు విషయంలో చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. ఈ సమయంలో  న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర కలుగజేసుకుని లోకాయుక్త చట్టంలో మార్పులపై రూపొందించాల్సిన ముసాయిదా బిల్లుపై చర్చ జరగాల్సి ఉందన్నారు.  మొదట ఈ విషయంపై చర్చకు అవకాశం కల్పించాలని తర్వాత మిగిలిన విషయాలపై చర్చిద్దామని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా విపక్షాలు వినిపించుకోక చర్చ జరగాల్సిందేనని పేర్కొన్నారు. దీంతో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో పరిస్థితిని యథాస్థితికి తీసుకురావడానికి స్పీకర్ కాగోడు తిమ్మప్ప శాసనసభను కొద్ది సేపు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభమైన తర్వాత విపక్షాలు కొద్ది సేపు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం సభాకార్యక్రమాలు కొనసాగాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement