నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే జితేంద్ర అవ్హాడ్ సస్పెన్షన్‌ను సోమవారం ఉపసంహరించారు.
సాక్షి, ముంబై: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే జితేంద్ర అవ్హాడ్ సస్పెన్షన్‌ను సోమవారం ఉపసంహరించారు. నాగపూర్‌లో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో గత శుక్రవారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతుండగా కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఆటం కం సృష్టించారు. దీంతో సభను వాయిదా వేయాల్సి వచ్చింది. కొద్ది సేపటి కి సభ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ ఇరుపార్టీల నాయకులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.
ఈ గందరగోళం మధ్య అవ్హాడ్ స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న స్పీకర్ హరిబావు భాగడే ఆయన్ని శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్సీపీ నాయకులు ఆ రోజు (శుక్రవారం) శాసనసభ కార్యకలాపాలను బహిష్కరించి బయటకు వెళ్లారు.