గవర్నర్‌తో ఎంపీ కవిత భేటీ
గవర్నర్ నరసింహన్‌తో నిజామాబాద్ ఎంపీ కవిత భేటీ అయ్యారు.
హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్‌తో నిజామాబాద్ ఎంపీ కవిత భేటీ అయ్యారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మొదటి కౌన్సిల్ సమవేశానికి గవర్నర్‌ను ఆమే ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ నియామకాల్లో.. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ మాదిరి స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు లబ్ధి కలిగేలా చూడాలని.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు.
ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో స్కౌట్‌ను తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా ఏపీ, తెలంగాణ యూనిట్స్‌గా విభజన అయ్యాయని తెలిపారు. గత ఏడాదిలో తెలంగాణ స్కౌట్స్ సాధించిన విజయాలను గవర్నర్‌కు తెలియజేశామన్నారు.