ట్రాన్స్‌జెండర్‌కు అవమానం!

Me Not Allowed In Mall, Says Transgender Sonali Dalvi - Sakshi

సాక్షి, పుణె: తమను చిన్నచూపు చూస్తున్నారంటూ ట్రాన్స్‌జెండర్లు ఎన్నో సందర్భాల్లో బయటకొచ్చి పోరాటాలు చేశారు. కానీ అక్కడక్కడా ట్రాన్స్‌జెండర్లకు అవమనాలు ఎదురవడం చూస్తుంటాం. తాజాగా పుణేలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. 29 ఏళ్ల ఓ ట్రాన్స్‌జెండర్ సోనాలి దాల్వీ షాపింగ్ చేసేందుకు పుణెలో ఓ సెంటర్‌కు వెళ్లారు. ఆమెను షాపింగ్ మాల్‌లోకి అనుమతించకుండా అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై బాధిత ట్రాన్స్‌జెండర్  సోనాలి ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. నేను ఇక్కడి ఫొనిక్స్ షాపింగ్ మాల్‌కు వెళ్లాను. మాల్ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది నన్ను లోనికి అనుమతించలేదు. దాదాపు అరగంట సేపు వారిని ప్రాధేయపడ్డా కనికరించలేదు. కారణం అడిగితే.. ట్రాన్స్‌జెండర్లను మాల్‌లోకి అనుతించడం లేదని చెప్పారు. నాకు జరిగిన అవమానంపై ఆ షాపింగ్ మాల్‌ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సోనాలి తెలిపారు. తనలాగ మరో ట్రాన్స్‌జెండర్‌కు అవమానం జరగకూడదని భావించి ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top