ఆన్‌లైన్‌లో ఎంబీఏ కోర్సులు | mba courses in online | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో ఎంబీఏ కోర్సులు

Feb 8 2014 2:17 AM | Updated on Sep 2 2017 3:27 AM

చెన్నైకు చెందిన ప్రముఖ మేనేజ్‌మెంట్ స్కూల్ గ్రేట్‌లెక్స్ ప్రముఖ విదేశీ బిజినెస్ స్కూల్ అయిన మై బి స్కూల్ డాట్ కాంతో కలసి విద్యార్థులకు మాస్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సులను మూక్స్ ప్రారంభిస్తోందని గ్రేట్‌లేక్స్ సంస్థ వ్యవస్థాపక డీన్ డాక్టర్ వి.బాలా బాలచంద్రన్ తెలిపారు

 అన్నానగర్, న్యూస్‌లైన్:
 చెన్నైకు చెందిన ప్రముఖ మేనేజ్‌మెంట్ స్కూల్ గ్రేట్‌లెక్స్ ప్రముఖ విదేశీ బిజినెస్ స్కూల్ అయిన మై బి స్కూల్ డాట్ కాంతో కలసి విద్యార్థులకు మాస్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సులను మూక్స్ ప్రారంభిస్తోందని గ్రేట్‌లేక్స్ సంస్థ వ్యవస్థాపక డీన్ డాక్టర్ వి.బాలా బాలచంద్రన్ తెలిపారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పంద వివరాలను వెల్లడించారు. ముఖ్యంగా ఎంబీఏ మేనేజ్‌మెంట్ విద్యార్థులకు ఈ ఆన్‌లైన్ మూక్స్ కోర్సులు ఒక వరం లాంటివన్నారు. 25 సబ్జెక్టుల్లో వీటిని బోధిస్తామన్నారు. మొత్తం 500 గంటల సేపు బోధనా తరగతులుంటాయన్నారు. ఆన్‌లైన్‌లో వీడియో లెక్చరర్లు కూడా ఉంటారన్నారు. దేశ, విదేశాలకు చెందిన మేనేజ్‌మెంట్ గురువులు ఆన్‌లైన్‌లో తరగతులను బోధిస్తారన్నారు. తాము ఉచితంగా బోధించే 25 మేనేజ్‌మెంట్లు సబ్జెక్టులు ఒక్కొక్కటి 20 గంటల నిడివిని కలిగి ఉంటాయని గ్రేట్‌లేక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ప్రొఫసర్ శ్రీరాం తెలిపారు.
 
  ఈ కోర్సులన్నీ ఆన్‌లైన్‌లో ఉచితంగా బోధిస్తున్నామని, వీటికి విద్యార్థులు ఎటువంటి ఫీజులు చెల్లించనవసరం లేదన్నారు. అదే విధంగా ఈ కోర్సులు పూర్తి అయిన తరువాత ఎటువంటి పరీక్షలూ, సర్టిఫికెట్లను ప్రదానం చేయడం వంటి ఫార్మాలిటీలుండవన్నారు. సర్టిఫికెట్లు పొందగోరే వారు ఫీజులను తప్పనిసరిగా చెల్లించాలన్నారు. ఫీజు చెల్లించిన వారికే తాము పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇతర వివరాలకు www.mybskoo .com లో సంప్రదించాలన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement