విద్యార్హతలు ఎక్కువగా ఉంటే ఉద్యోగాలకు అనర్హులే! 

Madras High Court Upholds Decision On Overqualified Candidates - Sakshi

మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు 

చెన్నై : ఉద్యోగానికి అవసరానికి మించి విద్యార్హతలు ఉన్న వారిని ఆయా ఉద్యోగాల్లో నియమించరాదని మద్రాస్‌ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఓవర్‌ క్వాలిఫికేషన్‌ పేరుతో చెన్నై మెట్రో తనకు ఉద్యోగం నిరాకరించడంతో ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఈ  తీర్పునిచ్చింది. వివరాల్లోకెళ్తే.. 2013లో లక్ష్మిప్రభ అనే అభ్యర్థి చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌)లో ట్రైన్‌ ఆపరేటర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. ఈ ఉద్యోగానికి డిప్లొమా అర్హత కాగా, ప్రభ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ కావడంతో.. ఆమె దరఖాస్తును సీఎంఆర్‌ఎల్‌ తిరస్కరించింది. దీంతో ఆమె మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. దేశంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తున్నా తన హక్కులను సీఎంఆర్‌ఎల్‌ నిరాకరించిందన్న పిటిషనర్‌ వాదనను జస్టిస్‌ వైద్యనాథన్‌ తోసిపుచ్చారు. ఓవర్‌ క్వాలిఫికేషన్‌ కలిగి ఉన్న ప్రస్తుత ఉద్యోగులనూ తొలగిస్తామని సంస్థ ప్రతినిధులు కోర్టుకు తెలిపారు.  

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top