ఫేస్‌బుక్‌లో ఆ ఇద్దరి ఫొటోలు హల్‌చల్‌ | kannada actress Shubha Punja giving clarity about her marriage gossips with nagendra prasad | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో ఆ ఇద్దరి ఫొటోలు హల్‌చల్‌

Oct 27 2016 8:49 AM | Updated on Jul 26 2018 5:23 PM

ఫేస్‌బుక్‌లో ఆ ఇద్దరి ఫొటోలు హల్‌చల్‌ - Sakshi

ఫేస్‌బుక్‌లో ఆ ఇద్దరి ఫొటోలు హల్‌చల్‌

నటి శోభా పూంజా, సినీ రచయిత నాగేంద్ర ప్రసాద్‌లు వివాహం చేసుకున్నారనంటూ కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి.

* పెళ్లయినట్లుగా ప్రచారం
* ఇదంతా అసత్య ప్రచారమన్న నటి శోభా పూంజా

బెంగళూరు:  కన్నడ చిత్ర నటి శోభా పూంజా, సినీ రచయిత నాగేంద్ర ప్రసాద్‌లు వివాహం చేసుకున్నారనంటూ కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఫొటోలను చూసిన ఇరువురి అభిమానులు హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ అంటూ వారి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు చేస్తున్నారు. కాగా ఇంకా చిత్రీకరణ దశలోనున్న కన్నడ చిత్రంలో నటిస్తున్న వీరిద్దరి ఫొటోలను  కొంత మంది సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేసినట్లు సమాచారం.

దీనిపై సినీ రచయిత స్పందిస్తూ తామిద్దరి ఫొటో ఎలా వైరల్‌ అయిందో తెలియట్లేదన్నారు. తనకు ఇదివరకే వివాహమైందని, ఇవేమి తెలియని కొంతమంది శుభా పూంజాతో తనకు వివాహమైనట్లు ఫొటోలు అప్‌లోడ్‌ చేయడం ద్వారా అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నటి శుభా పూంజా కూడా దీనిపై స్పందిస్తూ తనకు ఎవరితోనూ వివాహం కాలేదని, ఇది ఎవరో కావాలని తనను ఇబ్బంది పెట్టడానికి చేసిన చర్యగా ఆమె వ్యాఖ్యానించారు. ఇంకా పేరు పెట్టని ఓ చిత్రంలో నాగేంద్ర ప్రసాద్ తో కలిసి  నటిస్తున్నానని, ఆ సినిమాలో సన్నివేశంలో భాగంగానే తామిద్దరికి పెళ్లయినట్లు నటించినట్లు శుభా పూంజా వివరణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement