Nagendra Prasad
-
AP: ధర్మవరం సీఐ తల్లి కిడ్నాప్
మదనపల్లె/రాయచోటి: ధర్మవరం వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తల్లి స్వర్ణకుమారి(62) మదనపల్లెలో కిడ్నాప్ అయ్యారు. గత నెల 28న ఆమె అదృశ్యమై ంది. 9 రోజులు కావస్తున్నా నేటికీ జాడ కనుక్కోలేని పరిస్థితి చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. మదనపల్లె శివారు వైఎస్ జగన్ కాలనీలో సీఐ తల్లి స్వర్ణకుమారి ఒంటరిగా నివసిస్తోంది. సెప్టెంబర్ 28న మధ్యాహ్నం ఆమె స్నేహితురాలు స్వర్ణకుమారికి ఫోన్ చేస్తే కాల్ ఫార్వర్డ్ వాయిస్ వినిపించింది. సాయంత్రమైనా ఆమె ఇంటికి చేరుకోలేదు. ఆమెకు దైవభక్తి అధికం కావడంతో తెలిసిన వారితో కలిసి దూరప్రాంతంలోని గుడికి వెళ్లిందేమోనని స్నేహితురాలు భావించింది.కాగా, అక్టోబర్ 1న పెన్షన్ తీసుకునేందుకు స్వర్ణకుమారి రాకపోవడంతో స్థానికులు ఆ విషయాన్ని కుమారుడైన సీఐ నాగేంద్రప్రసాద్‌కు తెలిపారు. దీంతో ఆయన మదనపల్లెకు చేరుకుని తల్లి ఆచూకీ కోసం విచారించారు. మూడు రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో అక్టోబర్ 2న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీఐ కళా వెంకటరమణ అదృశ్యం కేసుగా నమోదుచేసి విచారణ చేపట్టారు. స్వర్ణకుమారి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటం, టవర్ లొకేషన్ ఒక్కో సమయంలో ఒక్కో ప్రాంతాన్ని సూచిస్తుండటంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. స్వర్ణకుమారి అదృశ్యం పట్టణంలో చర్చనీయాంశం కాగా.. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. వెంకటేశ్ అనే యువకుణ్ణి బెంగళూరులో పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. సీఐ తల్లికే దిక్కులేకపోతే? సీఐ తల్లి అదృశ్యమైతేనే ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని జనం చర్చించుకుంటున్నారు. ముందెన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో చిన్నారులు, మహిళలను కిడ్నాప్ చేసి అంతమొందించడం లాంటి వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో 9 రోజులైనా సీఐ తల్లి ఆచూకీ తెలియలేదంటే.. ఆమె విషయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై వరుస అఘాయిత్యాలు భయపెడుతున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో వాసంతిని, పుంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్‌ను తుదముట్టించిన ఘటనలు శాంతిభద్రతలను ప్రశ్నార్థకంగా మార్చాయి. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోవడంతో బాధితులు శవాలుగా మారిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు. పేపర్లకు ఉన్న విలువ ప్రాణాలకు లేదా?మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో కాగితాలు తగలబడితే చంద్రబాబు రాష్ట్ర డీజీపీని హెలికాప్టర్లో పంపించి దర్యాప్తు చేయించారు. అయితే.. బాలికలు, మహిళలను అపహరించుకుని పోయి అత్యాచారాలు చేస్తున్నా, హత్యలకు తెగబడుతున్నా పట్టించుకోవడంలేదు. -
ప్రభుదేవా తమ్ముడి డాన్స్ రాజా
నటుడు–దర్శకుడు ప్రభుదేవా సోదరుడు నాగేంద్ర ప్రసాద్, రాజ్ కుమార్, శ్రీజిత్ ఘోష్, రాంకీ, మనోబాల, ఊర్వశి, జూనియర్ బాలయ్య ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డాన్స్ రాజా డాన్స్’. ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించి భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని తమిళనాడు మాజీ గవర్నర్ – ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోశయ్య ఆవిష్కరించి, ‘డాన్స్ ప్రధానంగా రూపొందిన ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘రోశయ్యగారి చేతుల మీదుగా మా చిత్రం ఫస్ట్ లుక్ విడుదలవడం గర్వకారణం మాత్రమే కాకుండా విజయసూచకం. ఎం.ఎం. శ్రీలేఖ ఆలపించిన నాలుగు పాటలూ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తమిళంలో విజయం సాధించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మక ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రవి కనగాల పాల్గొన్నారు. -
ఫేస్బుక్లో ఆ ఇద్దరి ఫొటోలు హల్చల్
* పెళ్లయినట్లుగా ప్రచారం * ఇదంతా అసత్య ప్రచారమన్న నటి శోభా పూంజా బెంగళూరు: కన్నడ చిత్ర నటి శోభా పూంజా, సినీ రచయిత నాగేంద్ర ప్రసాద్‌లు వివాహం చేసుకున్నారనంటూ కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఫొటోలను చూసిన ఇరువురి అభిమానులు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ వారి ఫేస్బుక్లో పోస్ట్‌లు చేస్తున్నారు. కాగా ఇంకా చిత్రీకరణ దశలోనున్న కన్నడ చిత్రంలో నటిస్తున్న వీరిద్దరి ఫొటోలను కొంత మంది సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసినట్లు సమాచారం. దీనిపై సినీ రచయిత స్పందిస్తూ తామిద్దరి ఫొటో ఎలా వైరల్ అయిందో తెలియట్లేదన్నారు. తనకు ఇదివరకే వివాహమైందని, ఇవేమి తెలియని కొంతమంది శుభా పూంజాతో తనకు వివాహమైనట్లు ఫొటోలు అప్లోడ్ చేయడం ద్వారా అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నటి శుభా పూంజా కూడా దీనిపై స్పందిస్తూ తనకు ఎవరితోనూ వివాహం కాలేదని, ఇది ఎవరో కావాలని తనను ఇబ్బంది పెట్టడానికి చేసిన చర్యగా ఆమె వ్యాఖ్యానించారు. ఇంకా పేరు పెట్టని ఓ చిత్రంలో నాగేంద్ర ప్రసాద్ తో కలిసి నటిస్తున్నానని, ఆ సినిమాలో సన్నివేశంలో భాగంగానే తామిద్దరికి పెళ్లయినట్లు నటించినట్లు శుభా పూంజా వివరణ ఇచ్చారు. -
నాగేంద్రప్రసాద్ చిత్రం ఆఖరి రోజు విశేషాలు
గిన్నిస్ రికార్డు కోసం నాగేంద్రప్రసాద్ చేస్తున్న ‘సరదాగా ఒక సాయంత్రం’ ఆఖరి రోజు విశేషాలు ‘సరదాగా ఒక సాయంత్రం’ తొలి కాపీ సిద్ధమైంది. ఈ రోజు (గురువారం) ఉదయం 7 గంటలకు అన్నపూర్ణా స్టూడియోలోని ప్రివ్యూ థియేటర్లో ఈ చిత్ర ప్రదర్శన జరగనుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారి నిబంధనల ప్రకారం రిఫరీల సమక్షంలో ఈ స్క్రీనింగ్ జరగనుంది. సినిమా స్క్రీనింగ్ పూర్తయ్యేసరికి 9 రోజుల 22 గంటలవుతుంది. గతంలో 10 రోజుల 10 గంటల 30 నిమిషాల్లో సౌత్ ఆఫ్రికన్ ఫిల్మ్ ‘షాట్‌గన్ గార్ఫెంకల్’ స్క్రిప్ట్ టూ స్క్రీన్ రూపొంది, రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆ రికార్డును ‘సరదాగా ఒక సాయంత్రం’ అధిగమించినట్టే. ‘గిన్నిస్’ నుంచి అధికారిక గుర్తింపు రావడమే ఇక మిగిలింది. -
నాగేంద్రప్రసాద్ చిత్రం తొమ్మిదో రోజు విశేషాలు
గిన్నిస్‌బుక్ రికార్డు కోసం నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం తొమ్మిదో రోజు విశేషాలు ఎడిటింగ్, డబ్బింగ్, రీ-రికార్డింగ్, ఎఫెక్ట్స్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. 5.1 మిక్సింగ్, ఫైనల్ కట్ మాత్రం ఇంకా మిగిలి ఉన్నాయి. యూనిట్ మొత్తం రాత్రింబవళ్లూ శ్రమిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఫస్ట్‌కాపీని సిద్ధం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
సరదాగా ఒక సాయంత్రం మూవీ స్టిల్స్
-
నాగేంద్రప్రసాద్ చిత్రం ఎనిమిదో రోజు విశేషాలు
గిన్నిస్‌బుక్ రికార్డు కోసం నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఎనిమిదో రోజు విశేషాలు సోమవారం నాడు చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగాయి. ఒకపక్క ఎడిటింగ్, మరోపక్క డబ్బింగ్, వేరొకపక్క రీ-రికార్డింగ్, అలాగే డి.ఐ. కార్యక్రమాలు ఏకకాలంగా జరిగాయి. చిత్ర ఎడిటింగ్ పూర్తి అయింది. కథానాయిక మధూ లగ్నదాస్ మినహా ఇతర హీరో హీరోయిన్లు, చిత్రంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న బుల్లితెర నటుడు కృష్ణ కిశోర్ (కె.కె) సొంతంగా డబ్బింగ్ చెప్పున్నారు. సౌండ్ ఎఫెక్ట్‌ల పని దాదాపు 75 శాతం పూర్తయ్యింది. సోమవారం రాత్రి పొద్దుపోయే సమయానికి రీ-రికార్డింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి కావచ్చాయి. - వేరొక పక్క డి.ఐ. కొనసాగుతోంది. ‘‘నేను గతంలో ‘యువసేన’, ‘కిల్లర్’, ‘పోస్ట్‌బాక్స్’, ‘గణేష్’ తదితర చిత్రాల్లో నటించాను. అయితే, గిన్నిస్‌లోకి ఎక్కే ఇలాంటి సినిమాలో అవకాశం రావడం ఉద్వేగానికి గురి చేస్తోంది. అందులోనూ కథకు అత్యంత కీలకమైన పాత్ర నాది’’ - కె.కె. -
నాగేంద్రప్రసాద్ చిత్రం ఏడో రోజు విశేషాలు
గిన్నిస్‌బుక్ రికార్డు కోసం నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఏడో రోజు విశేషాలు ఆదివారం తెల్లవారుజాముకి పూర్తి స్థాయిలో షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, మరోపక్క ఎడిటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ‘యువసేన’ ఫేమ్, బుల్లితెర పాపులర్ నటుడు కృష్ణ కిశోర్ (కె.కె.) కీలక పాత్రలో చివరి రోజు షూటింగ్లో పాల్గొన్నారు. 80 శాతం రీ-రికార్డింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, డీఐ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. టైటిల్ యానిమేషన్, పోస్టర్ డిజైన్స్, ట్రైలర్స్ రూపొందించే పనిలో దర్శకుడు నాగేంద్ర ప్రసాద్, ఎడిటర్ శివ నిమగ్నమయ్యారు. -
నాగేంద్రప్రసాద్ చిత్రం ఆరో రోజు విశేషాలు
స్కిప్ట్ టు స్క్రీన్ సరదాగా ఒక సాయంత్రం గిన్నిస్‌బుక్ రికార్డు కోసం నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఆరో రోజు విశేషాలు ‘సరదాగా ఒక సాయంత్రం’ చిత్రం షూటింగ్ ఓ పాటతో సహా శనివారం విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా ‘గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డు’ సంస్థ వారిని ఉద్దేశిస్తూ, నటీనటులు, సాంకేతిక నిపుణులు వెల్లడించిన తమ అనుభవాలను సాక్ష్యం కోసం వీడియోగా చిత్రీకరించారు. షూటింగ్‌తో పాటు ఎడిటింగ్‌ను కూడా ఈ చిత్రం ఏకకాలంలో పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు 50 శాతం రీ-రికార్డింగ్ పూర్తయింది. ఆదివారం నుంచి మిగతా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ‘‘పరిమిత కాలవ్యవధిలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఏకకాలంలో అన్ని విభాగాలూ యుద్ధప్రాతిపాదికన పనిచేయడం నాకు ఆసక్తిగా అనిపించింది. ఈ యూనిట్ లో భాగస్వామిని కావడం చాలా సంతోషంగా ఉంది.’’ - మధు లగ్న దాస్ కథానాయికల్లో ఒకరు -
నాగేంద్రప్రసాద్ చిత్రం నాలుగో రోజు విశేషాలు
స్కిప్ట్ టు స్క్రీన్ గిన్నిస్‌బుక్ రికార్డు కోసం నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం నాలుగో రోజు విశేషాలు పది రోజుల్లో ‘స్క్రిప్ట్ టూ స్క్రీన్’ అనే కాన్సెప్ట్‌తో గిన్నిస్ బుక్ రికార్డు కోసం రూపొందిస్తున్న చిత్రం షూటింగ్, సాంకేతిక విభాగాలకు సంబంధించిన కార్యకలాపాలు శరవేగంతో సాగుతున్నాయి. కామెడీ, థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడు సుమన్ జూపూడి రూపొందించిన ఓ పాటను బుధవారం రాత్రి షూటింగ్ లొకేషన్లో యూనిట్ సభ్యుల మధ్య ‘ఐదర్ మోటార్స్ లిమిటెడ్’ ఎండీ శివకుమార్ ఆవిష్కరించారు. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ మార్గదర్శకత్వ ప్రమాణాలకు అనుగుణంగా న్యాయవాది పరమేశ్వర్రావు పర్యవేక్షణలో వీడియో చిత్రీకరించారు. ఈ చిత్రంలోని కీలక హాస్య సన్నివేశాలను ‘తాగుబోతు’ రమేశ్, ‘షకలక’ శంకర్‌లపై చిత్రీకరించి, ఎడిటింగ్, డీఐ కార్యక్రమాలు పూర్తి చేశారు. గురువారం షూటింగ్ కోసం హీరో, హీరోయిన్లపై చిత్రీకరించాల్సిన సన్నివేశాలకు సంబంధించిన డైలాగ్స్‌ను పూర్తి చేసుకుని చిత్రీకరణ చేపట్టారు. -
నాగేంద్రప్రసాద్ చిత్రం మూడో రోజు విశేషాలు
-
నాగేంద్రప్రసాద్ చిత్రం మూడో రోజు విశేషాలు
స్కిప్ట్ టు స్క్రీన్ గిన్నిస్‌బుక్ రికార్డు కోసం నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం మూడో రోజు విశేషాలు మంగళవారం అర్ధరాత్రి జరిపిన షూటింగ్లో ‘సుడిగాలి’ సుధీర్, ‘జబర్దస్త్’ శ్రీను, హీరో, హీరోయిన్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మూడవ రోజు(బుధవారం) షూటింగ్లో ‘తాగుబోతు’ రమేశ్, ‘షకలక’ శంకర్లు చిత్రంలో నటించడానికి సంసిద్ధతను వ్యక్తం చేయడంతో వారి సన్నివేశాలకు సంబంధించిన సీన్లు, డైలాగ్స్ సిద్ధం చేశారు. ఇప్పటివరకూ చిత్రీకరించిన సన్నివేశాలకు సంబంధించి ఆన్లైన్ ఎడిటింగ్, డీఐ తదితర కార్యక్రమాలను లొకేషన్లోనే పూర్తి చేసి సౌండ్ ఎఫెక్ట్స్, రీరికార్డింగ్ విభాగాలకు పంపించారు. ఈ చిత్రానికి అవసరమైన ఓ పాట రికార్డింగ్‌ను సంగీత దర్శకుడు సుమన్ జూపూడి పూర్తి చేశారు. గిన్నిస్ బుక్ రికార్డు నిబంధనలకు అనుగుణంగా సాగుతున్న ఈ షూటింగ్‌ను న్యాయవాది పరమేశ్వర్ రావు పర్యవేక్షించారు. -
నాగేంద్రప్రసాద్ చిత్రం రెండో రోజు విశేషాలు
స్కిప్ట్ టు స్క్రీన్ గిన్నిస్‌బుక్ రికార్డు కోసం నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం రెండో రోజు విశేషాలు తారాగణం ఎంపిక కోసం ఫేస్బుక్లో చేసిన ప్రచారానికి విశేషాదరణ లభించింది. చాలామంది తమ ప్రొఫైల్స్ పంపించారు. వాటిల్లోంచి 15 మందిని ఎంచుకుని, మేకప్ టెస్ట్‌కు పిలిచారు. ఫైనల్‌గా ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేశారు. ఒక హీరోగా చేస్తున్న సుమంత్‌రెడ్డికిదే తొలి సినిమా. మరో హీరో మనీష్ ఇంతకుముందు ‘హమ్‌తుమ్’ తదితర చిత్రాల్లో నటించారు. కథానాయికలు ఆకృతి, మధులగ్నదాస్ ఇప్పటికే కొన్ని సినిమాలు చేశారు. కొన్ని సన్నివేశాలు సంభాషణలతో సహా సిద్ధమయ్యాయి. సంగీత దర్శకుడు సుమన్ జూపూడి తానే ఓ పాట రాసి బాణీతో సహా సిద్ధం చేశారు. ప్రస్తుతం పాట ఆ రికార్డింగ్ జరుగుతోంది. షూటింగ్‌కు కావాల్సిన సరంజామా అంతా సిద్ధం చేసుకున్నారు. లొకేషన్ల ఎంపిక కూడా పూర్తయింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్-మియాపూర్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో చిత్రీకరణ మొదలు పెట్టారు. తెల్లవారు జాము 6 గంటల వరకూ నిర్విరామంగా ఈ షూటింగ్ జరుగుతుంది. -
ఫిరంగుల ప్రదర్శన
గుత్తి, న్యూస్‌లైన్: చరిత్రాత్మకమైన గుత్తి కోటలో అప్పటి పాలకులు వినియోగించిన ఫిరంగులను కొంత కాలం క్రితం స్థానికులు వెలికి తీశారు. వీటిపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో వీటిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఫిరంగులను వెలికితీసేందుకు కృషి చేసిన ట్రాన్స్‌కో సిబ్బంది, కోట పరిరక్షణ సమితి నాయకులు, ప్రజలను పూలమాలలతో అభినందించారు. ఈ సందర్భంగా కోట పరిరక్షణ సమితి నాయకులు మాట్లాడుతూ ఫిరంగులకు కోట క్రింద భాగంలో ఉన్న సమాధుల వద్ద ఉంచి రక్షణ కల్పిస్తామని తెలిపారు.ర్యక్రమంలో కోట పరిరక్షణ సమితి నాయకులు జయరంగారెడ్డి,నాగేంద్ర ప్రసాద్,చిన్నా,108 శ్రీనా, రఫీ,ఆచారి పాల్గొన్నారు.